కరప్షన్ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు.. శాతాలెన్ని?

కరప్షన్.. ప్రభుత్వ పనుల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యవహారాలన్నింటికీ కూడా ఇదే ఆయుధం. ఈ స్మార్ట్ యుగంలో పనులు కావాలంటే తప్పకుండా లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో ఏమేరకు అవినీతి జరుగుతుందో తెలుసుకోవాలని తాజాగా ఇండియా కరప్షన్ 2019 పేరుతో ఓ సర్వే నిర్వహించారు. 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ మధ్య ఎంత మేరకు రాష్ట్రాల్లో కరప్షన్ జరిగిందనే దానిపై.. సుమారు 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది […]

కరప్షన్ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు.. శాతాలెన్ని?
Follow us

|

Updated on: Nov 30, 2019 | 8:27 PM

కరప్షన్.. ప్రభుత్వ పనుల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యవహారాలన్నింటికీ కూడా ఇదే ఆయుధం. ఈ స్మార్ట్ యుగంలో పనులు కావాలంటే తప్పకుండా లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో ఏమేరకు అవినీతి జరుగుతుందో తెలుసుకోవాలని తాజాగా ఇండియా కరప్షన్ 2019 పేరుతో ఓ సర్వే నిర్వహించారు. 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ మధ్య ఎంత మేరకు రాష్ట్రాల్లో కరప్షన్ జరిగిందనే దానిపై.. సుమారు 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు. ఇక ఈ సర్వే‌లో రెండు తెలుగు రాష్ట్రాల గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఊహించని రీతిలో తెలంగాణ అవినీతిలో ఐదో స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. అంతేకాక రాష్ట్రంలో వందకు 67% మంది ప్రజలు తమ పనులకు లంచం ఇస్తున్నట్లుగా గుర్తించారు. తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత.. అవినీతి స్థాయి 50 శాతానికి తగ్గిందని తెలుస్తోంది. అటు దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా రాజస్థాన్ మొదటి ప్లేస్‌లో నిలిస్తే.. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. 67 శాతంలో 56% మంది రెండుసార్ల కంటే ఎక్కువగా లంచాలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. కొందరు నేరుగా అధికారులకే ఇవ్వగా.. మరికొందరు పరోక్షంగా చెల్లించారు. అంతేకాక భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో 40 శాతం మంది లంచం ఇచ్చినట్లు గుర్తించారు. అటు గతేడాది(43%)తో పోలిస్తే.. ఈ ఏడాది తెలంగాణలో గణనీయంగా అవినీతి స్థాయి 67 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది. ఇకపోతే అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. అక్కడ 10 శాతం మాత్రమే ఉంది. గోవా (20), ఒడిశా (40), ఢిల్లీ (46)ల్లో ఇలా అవినీతి నమోదైంది.

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి