దేవుడా.. దేవుడా.. నువ్వే దిక్కు..! నేతల పూజలు..!

ఇంకా కొన్ని గంటలే.. విజయం వరించేదెవర్ని..? పరాజయం పలకరించేదెవర్ని..? ఇంకా కొన్ని గంటలే.. అధికారం ఎవరి చేతికి..? ప్రతిపక్ష హోదా ఎవరికి..?. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నాయకులంతా దేవుడి మంత్రం జపిస్తున్నారు. ప్రతిపక్షహోదా వద్దు, అధికారమే ముద్దని తమను గెలిపించు మహో ప్రభో అంటూ వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో చంద్రబాబు కుటుంబసమేతంగా పూజలు చేశారు. గంగమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు, వొడిబాల సమర్పించారు. సీఎం పర్యటన […]

దేవుడా.. దేవుడా.. నువ్వే దిక్కు..! నేతల పూజలు..!
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 4:42 PM

ఇంకా కొన్ని గంటలే.. విజయం వరించేదెవర్ని..? పరాజయం పలకరించేదెవర్ని..? ఇంకా కొన్ని గంటలే.. అధికారం ఎవరి చేతికి..? ప్రతిపక్ష హోదా ఎవరికి..?. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నాయకులంతా దేవుడి మంత్రం జపిస్తున్నారు. ప్రతిపక్షహోదా వద్దు, అధికారమే ముద్దని తమను గెలిపించు మహో ప్రభో అంటూ వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో చంద్రబాబు కుటుంబసమేతంగా పూజలు చేశారు. గంగమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు, వొడిబాల సమర్పించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కూడా పూజలు చేస్తున్నారు.

మరోవైపు.. వైసీపీ నేతలు సైతం ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ పూజలు చేస్తున్నారు. గుంటూరు అరండల్ పేటలోని సాయిబాబా గుడిలో మోదుగుల, ముస్తఫా, రోజా సహా పలువురు వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ గెలుపు కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టారు. జగన్ సీఎం కావాలని కేంద్రంలో ప్రధానిని నిర్ణయించే శక్తి వైసీపీకి రావాలని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపారు.

ఇక తిరుమల క్షేత్రంలో గత వారం రోజులుగా రాజకీయ నాయకుల హడావిడి అంతా ఇంతా కాదు. తమ పార్టీనే గెలిపించాలని నేతలు శ్రీవారిని వేడుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడ్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారి శక్తికి తగ్గట్టు కానుకలు సమర్పిస్తున్నారు. మరికొందరైతే కొండకు కాలినడకన ఎక్కి తలనీలాలు సమర్పించుకుంటున్నారు.