#Lock-down కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరిన్ని కఠిన నిర్ణయాలు

ఏపీలో రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుతుందన్న కథనాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు రెడీ అయ్యింది.

#Lock-down కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరిన్ని కఠిన నిర్ణయాలు
Follow us

|

Updated on: Mar 30, 2020 | 12:09 PM

Jagan government has taken few more steps to curb Covid-19: ఏపీలో రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు హాస్పిటళ్ళను ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంది. ప్రైవేటు ఆసుపత్రులపై పూర్తి అజమాయిషీ ఆయా జిల్లాల కలెక్టర్లకు కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో నియంత్రణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వైద్య, ఆరోగ్య శాఖా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఏపీ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించిన నేపధ్యంలో రాష్ట్రంలో అన్ని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌లోని గదులు, వెంటిలేటర్స్, ల్యాబ్స్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది సేవల వినియోగానికి తాజా ఆదేశాలు ఉపయోగపడతాయి.

అత్యవసర పరస్థితుల్లో వైద్య నిపుణుల సేవలు వినియోగించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు వైద్య, ఆరోగ్య శాఖా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి అవసరమైన చోట వీరి సేవలు తక్షణం వినియోగించుకునేలా ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వేతర, ప్రైవేట్ సంస్థలు అన్నిటిలో ఎలాంటి లోపం లేకుండా సేవలు అందించాలని నిర్దేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి తీసుకొస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది.