కారు ప్రమాదంతో చిక్కుల్లో పడ్డ రష్మీ

విశాఖ: ఇటీవలే కొత్త కారు కొనుగోలు చేసిన రష్మీ చిక్కుల్లో పడింది. విశాఖ నగరంలో ఆమె కొత్త కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని రష్మీ కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్ట […]

కారు ప్రమాదంతో చిక్కుల్లో పడ్డ రష్మీ
Follow us

|

Updated on: Mar 18, 2019 | 8:48 AM

విశాఖ: ఇటీవలే కొత్త కారు కొనుగోలు చేసిన రష్మీ చిక్కుల్లో పడింది. విశాఖ నగరంలో ఆమె కొత్త కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని రష్మీ కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్ట సమాచారం.