Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ వైద్యుడి మార్పు. మెంటల్ కేర్ ఆసుపత్రి డాక్టర్ రామిరెడ్డిని మార్చిన అధికారులు. రామిరెడ్డి స్థానంలో మహిళా డాక్టర్ కు ట్రీట్ మెంట్ బాధ్యతలు. డాక్టర్ రామిరెడ్డిపై ఆరోపణల నేపధ్యంలో నిర్ర్భయం తీసుకున్న ఆసుపత్రి అధికారులు. డాక్టర్ సుధాకర్ ట్రీట్ మెంట్ పొందే ఫోర్త్ యూనిట్ కు చీఫ్ గా వ్యవహరుస్తున్న డాక్టర్ రామిరెడి.
  • చిత్తూరు జిల్లా : ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు. అయితే ఇవి మహారాష్ట్రనుంచి వచ్చిన మిడతల దండు కాదంటున్న అధికారులు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు వేపనపల్లి లో ప్రత్యక్షమైన మిడతల దండు. రాత్రికి రాత్రే పంటలు నాశనం చేస్తున్న మిడతలు. పచ్చగా కనిపించిన ప్రతి చెట్టుని తినేస్తున్న మిడతలు. అరటి చెట్లను వదలని మిడతలు. రంగంలోకి దిగిన అధికారులు..మిడతల పై ఫెర్టిలైజర్స్ చల్లి తరిమి కొట్టే ప్రయత్నం.
  • బంజారాహిల్స్ లో దారుణం. భార్యను హతమార్చిన భర్త. భార్య భర్తల గొడవతో హీటర్ తో బాధి హత్య చేసిన భర్త. తలకు గాయం కావడం తో మృతి చెందిన భార్య. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.
  • ఈరోజుతో ముగియనున్న సర్వేలేన్స్ సర్వే. ఎలిజా ప్రక్రియ ద్వారా రక్త నమూనా సేకరిస్తున్న ICMR ,NIN. జిహెచ్ఎంసి లోని ఐదు ప్రాంతాలలో ఈరోజు సర్వే. 18 సంవత్సరాలు పై బడిన అన్ని వయసుల వారికి టెస్టులు చేస్తున్న NIN. ఒక్కో కంటైన్మెంట్ జోన్ 100 శాంపిల్స్ తీసుకుంటున్న ICMR,NIN అధికారులు. మొత్తం రంగారెడ్డి,ghmc లలో 500 శాంపిల్స్ తీసుకోనున్న బృందాలు. మొత్తం సిరం శాంపిల్స్ ను చెన్నై పంపనున్న ICMR,NIN అధికారులు.
  • తిరుపతి లో గంజాయి మత్తుగాళ్ళ హాల్ చల్ . తాతయ్యగుంట లో గంజాయి మత్తులో యువకుడి పై కత్తితో దాడి . శనివారం రాత్రి సంఘటన . దాడికి పాల్పడిన ఆరుగురు దుండగులు . కతిదాడిలో తీవ్రంగా గాయపడిన వెంకట సాయి (15). రుయా ఆసుపత్రి కి తరలింపు... ప్రాథమిక చికిత్స . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

తను కురచ దుస్తులు వేసిందా? పసికందు దారుణంపై రష్మి ఆవేదన

Anchor Rashmi reacts Over 9 month old-girl rape and murder incident, తను కురచ దుస్తులు వేసిందా? పసికందు దారుణంపై రష్మి ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 9 నెలల పసికందు హత్యాచారం, హత్య ఘటనపై  సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ దారుణంపై నటి, యాంకర్ రష్మి ఘాటుగా స్పందించారు.

‘9 నెలల పసికందుపై జరిగిన దారుణం చూసి నా మనసు చలించి పోయింది. ఆమె ఏం తప్పు చేసింది? పొట్టి దుస్తులు ధరించిందా? క్లీవేజ్ ప్రదర్శించిందా? కాళ్లు చూపించిందా? తన ఒపీనియన్ వెల్లడించిందా? ఏం తప్పు చేసింది?’ అంటూ….. రష్మి ఫైర్ అయ్యారు. మహిళల వస్త్రధారణ సరిగా లేక పోవడం వల్లే అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి అనే విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి రష్మి ఈ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్లో రష్మి రియాక్ట్ అవుతూ ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు. ‘బేటీ బచావో బేటీ పడావో అన్నారు ఎక్కడ సార్? ఇక్కడ బేటీకి రక్షణ కూడా లేకుండా పోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. రష్మి చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ఆమెకు మద్దతుగా రిట్వీట్లు చేస్తున్నారు.

Related Tags