Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్‌ రాంబాబు టీవీ9 గుడ్‌మార్నింగ్ ఇండియాలో చెప్పినట్టుగానే పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం కరెక్ట్‌ కాదంటున్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు. అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తామనడం సబబు కాదన్నారు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్ల ప్రభుత్వ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తిరునాళ్లను తలపిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు.
  • కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో కరోనా ల్యాబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. టెలీ మెడిసిన్‌ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు కేంద్రమే నిర్ణయించాలంటున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.

వెకిలి చేష్టలు.. పోలీసులను ఆశ్రయించిన యాంకర్ అనసూయ

Anchor Anasuya complaints to Cyber Crime Police over Abusive Comments, వెకిలి చేష్టలు.. పోలీసులను ఆశ్రయించిన యాంకర్ అనసూయ

పాపులర్ యాంకర్, నటి అనసూయ పోలీసులను ఆశ్రయించింది. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చిల్లరిగాళ్ల వేధింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీంతో ఇటీవలే సింగర్ కౌసల్య, సపోర్టింగ్ యాక్టర్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు చేస్తోన్న అసభ్యకరమైన కామెంట్స్‌, వెకిలి చేష్టలతో విసుగుపోయానని ట్విట్టర్ ద్వారా ఆమె ట్వీట్ చేసింది. అంతేకాదు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్‌లో వారిని కోరింది. అలాగే.. శృతి మించుతూ చేస్తోన్న అసభ్యకరమైన కామెంట్స్‌ పట్ల స్పందించకపోతే.. ఇక తన సహనానికి అర్థం ఉండదని ఆమె ట్వీట్‌లో పేర్కొంది. ఈ వ్యాఖ్యల పట్ల తానేమీ సిగ్గుపడటం లేదని, సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని కోరింది. అనసూయ ట్వీట్‌కు స్పందించిన సైబర్ క్రైమ్స్‌తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ వారు కూడా స్పందించడం విశేషం.

కాగా.. యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై ట్విటర్‌లో కామెంట్ చేసింది ‘యాక్టర్స్ మసాలా’ అనే అకౌంట్ నుండి చేశారు. సైబర్ క్రైమ్స్‌కు ట్విట్టర్ ద్వారా అనసూయ, సాయి రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాము. అయినా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం ఉంటుంది. ఆ అకౌంట్ నుండి పలువురు హీరోయిన్స్, యాంకర్స్‌పై ఈ విధంగా పోస్టు వస్తున్నాయి. సెలబ్రెటీలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే.. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయని కెవీఎం ప్రసాద్ ( సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ) తెలిపారు.

తన ట్వీట్‌కి స్పందించిన పోలీసులు ఆమె ధన్యావాదాలు తెలిపింది. కాగా.. మరికొందరు నెటిజన్స్ కూడా అనసూయకు మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Related Tags