అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం, వైద్యానికి డబ్బులు లేక చేనేత కార్మికుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 12:18 pm, Thu, 3 December 20

అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని శాంతినగర్​కు చెందిన రామకృష్ణ.. మగ్గం కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో పనిచేయలేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా సరైన వైద్యం చేయించుకోలేకపోయాడు.

ఈ క్రమంలో  ఇంటి నుంచి బయటకు వెళ్లి రైల్వే గేట్​ వద్ద షెడ్డులో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

Also Read :

నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !