అదరగొడుతున్న అనసూయ ‘క‌థ‌నం’ ట్రైల‌ర్

anasuya bharadwaj kathanam movie theatrical trailer released, అదరగొడుతున్న అనసూయ ‘క‌థ‌నం’ ట్రైల‌ర్

అందాల యాంక‌ర్‌  అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రధాన  పాత్ర‌లో రూపొందిన చిత్రం ‘కథనం’. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో  అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. ‘క్ష‌ణం, రంగ‌స్థ‌లం’ అనంతరం ‘క‌థ‌నం’తో అనసూయ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ద‌మైంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్  విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై చాలా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ధ‌న‌రాజ్ వ‌ల్లే ఈ సినిమాలో న‌టించాన‌ని ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చింది అన‌సూయ‌. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. అదే రోజు నాగార్జున నటించిన మన్మథుడు2 కూడా రిలీజ్ అవ్వనుంది. సో అనసూయ తన ఆల్ టైం ఫేవరెట్ హీరో నాగ్ బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *