చిన్నారుల మరణాలు.. ఆస్పత్రుల్లో మృత్యుఘంటికలు

ప్రభుత్వాస్పత్రులు చిన్నారుల మరణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లల జీవితాన్ని చిన్నతనంలోనే చిధిమేస్తున్నాయి. అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా ఒకేరోజు ఆరుగురు చిన్నారులు చనిపోయారు. గత ఐదు నెలల్లో 168 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘోరానికి బాధ్యులెవరు..? ఈ దారుణాలకు కారకులెవరు..? డాక్టర్ల నిర్లక్ష్యమే చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. రాను రాను సర్కార్ దవాఖానాల్లో పసిపిల్లల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. అనంతపురం జిల్లా ఆస్పత్రిని సర్వజనాసుపత్రి అని […]

చిన్నారుల మరణాలు.. ఆస్పత్రుల్లో మృత్యుఘంటికలు
Follow us

|

Updated on: Jun 12, 2019 | 3:37 PM

ప్రభుత్వాస్పత్రులు చిన్నారుల మరణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లల జీవితాన్ని చిన్నతనంలోనే చిధిమేస్తున్నాయి. అనంతపురం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏకంగా ఒకేరోజు ఆరుగురు చిన్నారులు చనిపోయారు. గత ఐదు నెలల్లో 168 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘోరానికి బాధ్యులెవరు..? ఈ దారుణాలకు కారకులెవరు..? డాక్టర్ల నిర్లక్ష్యమే చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఉన్నాయి.

రాను రాను సర్కార్ దవాఖానాల్లో పసిపిల్లల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. అనంతపురం జిల్లా ఆస్పత్రిని సర్వజనాసుపత్రి అని కూడా పిలుస్తారు. జిల్లాలో ఎవరు ఏ వ్యాధి బారిన పడినా ఇక్కడికే వస్తారు. అయితే ఓ సారి సౌకర్యాల లేమి, మరోసారి వైద్యుల కొరత, ఇంకోసారి సిబ్బంది నిర్లక్ష్యం.. ఇలా కారణాలు ఏవైనా ఈ మధ్యకాలంలో తరచూ మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరుగురు చిన్నారులు ఒకే రోజు చనిపోవడం కలకలం రేపుతోంది.

ఆస్పత్రిలోని నవజాత శిశు చికిత్స కేంద్రం SNCUలో మరణ మృదంగం మోగుతోంది. చిన్నారులు వరుసగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా మొత్తం 14 మంది చిన్నారులు మృతిచెందినట్లు సమాచారం. ఆస్పత్రిలో సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే చిన్నారులు మృత్యు బారిన పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. అయితే వైద్యుల తప్పిదాల కారణంగానే పిల్లలు చనిపోతున్నారని.. దీనిపై ఉన్నతాధికారులు కమిటీ వేసి విచారణ జరిపించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్