కారు కావాలా నాయనా..? అలా చేస్తే నా దుకాణం సర్దేయాల్సిందే

Anand Mahindra Hilarious Answer, కారు కావాలా నాయనా..? అలా చేస్తే నా దుకాణం సర్దేయాల్సిందే

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అక్కడ తన బిజినెస్‌ విషయాలకంటే అందరినీ ఆలోచింపజేసే, సందేశాత్మక ట్వీట్లు, వైరల్ వీడియోలను ఎక్కువగా షేర్ చేసే ఆయన.. అత్యధిక ఫాలోవర్లను కూడా సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ అందరినీ నవ్విస్తోంది.

వివరాల్లోకి వెళ్లే.. విపుల్ అనే ఓ నెటిజన్.. ‘‘సర్ నేను మీకు పెద్ద అభిమానిని. నా పుట్టినరోజుకు మీరు మహీంద్రా థార్‌ను బహుమతిగా ఇస్తారా..?’’ అని ఆనంద్ మహీంద్రాకు ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన ఆయన CHUTZPAH అనే ఇంగ్లీష్ పదాన్ని పెట్టి.. దాని అర్థం ‘అతి విశ్వాసం’ అని వెల్లడించారు. ఆ తరువాత ‘‘అతడిని ఇష్టపడండి.. ద్వేషించండి.  విపుల్ CHUTZPAHకు నేను ముగ్ధుడినయ్యా. కానీ నీ అభ్యర్థనకు నేను అవును అని చెప్పలేను. ఎందుకంటే అలా చేస్తే నా దుకాణం సర్దేయాల్సి వస్తుంది’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారగా.. ఆనంద్ మహీంద్రా సెన్సాఫ్ హ్యూమర్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *