చపాతీ నేనిలానే చేస్తా.. అర్ధాంగికి మహీంద్రా చిలిపి ట్వీట్!

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు వింత ట్వీట్స్.. కొన్నిసార్లు కొత్త విషయాలు చెబుతూ నెటిజన్లకు ఎన్నో సంగతులు పరిచయం చేస్తుంటారు. ఈ పంధాలో ఆయన సతీమణి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేసిన ఓ క్రియేటివ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ వర్షాకాలం వారాంతాల్లో మేం ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు నా సతీమణి వంటలో సాయం చేస్తారా అని అడిగింది. నేను ఈ చిత్రాన్ని ఆమెకు పంపి, నా […]

చపాతీ నేనిలానే చేస్తా.. అర్ధాంగికి మహీంద్రా చిలిపి ట్వీట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2019 | 8:16 PM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు వింత ట్వీట్స్.. కొన్నిసార్లు కొత్త విషయాలు చెబుతూ నెటిజన్లకు ఎన్నో సంగతులు పరిచయం చేస్తుంటారు. ఈ పంధాలో ఆయన సతీమణి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేసిన ఓ క్రియేటివ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ వర్షాకాలం వారాంతాల్లో మేం ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు నా సతీమణి వంటలో సాయం చేస్తారా అని అడిగింది. నేను ఈ చిత్రాన్ని ఆమెకు పంపి, నా పని ఇలానే ఉంటుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు లైక్స్ వేల సంఖ్యలో రాగా.. నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.

‘ఇది చూశాకా ఆమె మిమ్మల్ని ఇంకోసారి సాయం చేయమని కోరరు’ అని ఒక నెటిజన్‌ కామెంట్ చేస్తే.. ‘మీరు నా స్ట్రాటజీని గుర్తించారు!’ అని ఆనంద్‌ తిరిగి సమాధానం ఇచ్చారు.