దేవుడి దయ వల్ల ఈయన నా టీచర్ కాలేదు: ఇమ్రాన్‌పై మహీంద్రా సెటైర్లు

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా సెటైర్లు వేశారు. ఇమ్రాన్ మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేసిన మహీంద్రా.. ‘‘దేవుడి దయవల్ల ఈ వ్యక్తిని నాకు చరిత్ర, భౌగోళిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవ్వలేదు’’ అని కామెంట్ చేశారు. కాగా ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్.. జపాన్, జర్మనీ దేశాలు రెండు ఒకే సరిహద్దును కలిగి ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఇమ్రాన్ చెప్పిన ఆ కామెంట్లకు ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు. ఇక ఈ వీడియో […]

దేవుడి దయ వల్ల ఈయన నా టీచర్ కాలేదు: ఇమ్రాన్‌పై మహీంద్రా సెటైర్లు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 11:55 AM

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా సెటైర్లు వేశారు. ఇమ్రాన్ మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేసిన మహీంద్రా.. ‘‘దేవుడి దయవల్ల ఈ వ్యక్తిని నాకు చరిత్ర, భౌగోళిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవ్వలేదు’’ అని కామెంట్ చేశారు. కాగా ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్.. జపాన్, జర్మనీ దేశాలు రెండు ఒకే సరిహద్దును కలిగి ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఇమ్రాన్ చెప్పిన ఆ కామెంట్లకు ఆనంద్ మహీంద్రా సెటైర్ వేశారు. ఇక ఈ వీడియో ఈ ఏడాది మొదట్లో ఓ సమావేశంలో మాట్లాడినది కాగా.. అప్పట్లో కూడా ఆయనపై నెటిజన్లు ఫుల్ కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పుడు మహీంద్రా ట్వీట్‌తో మరోసారి ఆ వీడియో వైరల్‌గా మారగా.. అందరి చేత నవ్వులు పూయిస్తోంది. అయితే ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ నోరు జారడం ఇది మొదటి సారేం కాదు. గతంలో పలుమార్లు నోరు జారి విమర్శల పాలయ్యారు.