బీహార్ ‘మాంజీ’ కి ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ కానుక
బీహార్ లోని గయ జిల్లా లాతువా గ్రామానికి చెందిన మాంజీ (కెనాల్ మ్యాన్) లోంగి భూయాన్ కృషి ఫలిచింది. ఎండిపోతున్న తన పొలానికి వాన నీటిని మళ్లించేందుకు ఈ పేద రైతు 30 సంవత్సరాల పాటు..
బీహార్ లోని గయ జిల్లా లాతువా గ్రామానికి చెందిన మాంజీ (కెనాల్ మ్యాన్) లోంగి భూయాన్ కృషి ఫలిచింది. ఎండిపోతున్న తన పొలానికి వాన నీటిని మళ్లించేందుకు ఈ పేద రైతు 30 సంవత్సరాల పాటు ఎండనక, వాననక కష్టపడి మూడు కి.మీ. కాలువ తవ్వాడు. ఈ రైతు కథనం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను కదిలించింది. భూయాన్ కి ఆయన సరికొత్త ట్రాక్టర్ ను బహుకరించారు. మాంజీ తవ్విన కాలువ తాజ్ లేదా ఈజిప్ట్ పిరమిడ్లకన్నా అత్యద్భుత ‘మాన్యుమెంట్’ అని అభివర్ణించారు. ఈ ట్రాక్టర్ ను బహుకరించడం ద్వారా భూయాన్ ని గౌరవించాలనుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ అపూర్వ స్పందన నేపథ్యంలో బీహార్ లోని మహీంద్రా గ్రూప్ ఉద్యోగులు, డీలర్ పార్ట్ నర్ కూడా ఈ ట్రాక్టర్ వద్ద భూయాన్ నిలబడిన ఫోటోను షేర్ చేశారు. తనకు లభించిన ఈ బహుమానం పట్ల భూయాన్ అమితానందం వ్యక్తం చేశాడు.
You & your team are simply the best @hsikka1 Can’t believe I proposed gifting Laungi Bhuiyan—Bihar’s ‘CanalMan”—a tractor only yesterday morning & by late yesterday evening you had delivered it to him! Well done, & my gratitude to our dealer partner as well. pic.twitter.com/EFCBsrgPq2
— anand mahindra (@anandmahindra) September 20, 2020
उनको ट्रैक्टर देना मेरा सौभाग्य होगा। As you know, I had tweeted that I think his canal is as impressive a monument as the Taj or the Pyramids. We at @MahindraRise would consider it an honour to have him use our tractor. How can our team reach him @rohinverma2410 ? https://t.co/tnGC5c4j8b
— anand mahindra (@anandmahindra) September 19, 2020