‘దొరసాని’పై హీరో ఫస్ట్ ‘లుక్’

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దొరసాని’. సీనియర్ హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్‌పై వెంబడిస్తూ హీరో ఆరాధనగా ఆమెను చూస్తున్నట్లు ఉన్న ఈ లుక్ సినిమా కథను చెప్పకనే చెబుతోంది. 80ల్లో ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాల మధ్య ఓ పేదింటి రాజుకి, గొప్పింటి దొరసానికి మధ్య ఏర్పడిన ప్రేమ కథే ఈ ‘దొరసాని’ చిత్ర నేపధ్యం.

కె.వి.మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, బిగ్ బెన్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *