Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

టాలీవుడ్ స్టార్ల రెమ్యునరేషన్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Tollywood Star Heroes Remunerations, టాలీవుడ్ స్టార్ల రెమ్యునరేషన్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకి పారితోషికం ఎంత తీసుకుంటారనేది ఫ్యాన్స్ అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే ఈ హీరోల రెమ్యునరేషన్ వాళ్ళ సక్సెస్ రేట్, డిమాండును బట్టి ఉంటుందని చెప్పొచ్చు. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోల పారితోషికం అయితే ఆకాశాన్ని టచ్ చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోలదే హవా నడుస్తోంది.

ఇదిలా ఉండగా టాలీవుడ్‌ను ఏలుతున్న అగ్రహీరోల రెమ్యునరేషన్స్‌ను పరిశీలిస్తే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకి 25 కోట్ల రేంజ్ ఉండేది. అయితే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకోవడంతో.. ఆయన స్థాయి అమాంతం 50 కోట్లకు చేరింది. పారితోషికం, లాభాల్లో వాటా అంటూ ఓవరాల్‌గా అంత ముడుతోందట. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రానికి మహేష్ రూ.54 కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ఇక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి రెమ్యునరేషన్ రూ.40 కోట్ల మార్క్‌ను తాకిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఒక్కొక్కరూ 40 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయనకు వరుసగా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి. వీటిలో ఒక్కో సినిమాకి రూ.25 కోట్ల మేరకు పారితోషికం తీసుకుంటున్నారట. అటు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. బాహుబలి 1-2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లేటెస్ట్‌గా రిలీజైన ప్యాన్ ఇండియన్ మూవీ ‘సాహో’తో అతడి స్థాయి చుక్కల్ని తాకింది. ఈ చిత్రానికి గానూ యూవీ క్రియేషన్స్ నుంచి దాదాపు 65 కోట్ల మేర పారితోషికం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నెక్స్ట్ సినిమా ‘జాను’కు కూడా భారీ రేంజులోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. .

సీనియర్ హీరోల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా కోసం పారితోషికం డిమాండ్ చేయలేదని తెలిసిన విషయమే. సొంత ప్రొడక్షన్ బ్యానర్ కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చారని అనుకోవచ్చు. అటు విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమాకి రూ.8 కోట్లు, అక్కినేని నాగార్జున రూ. 7.5 కోట్లు.. నందమూరి బాలకృష్ణ రూ.9 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి. ప్రస్తుతం మాస్‌రాజా రవితేజ కూడా రూ.6 కోట్లు తీసుకుంటున్నారట.

మరోవైపు యంగ్ హీరోల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకి రూ.12 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటుండగా.. రౌడీ విజయ్ దేవరకొండ రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అటు శర్వానంద్ రూ.4 కోట్లు, వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రూ.4 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్.