‘ బాహుబలి ‘ ని ‘ సాహో ‘ బీట్ చేస్తాడా ..?

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి.. బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టిన రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్ ల చిత్రం ‘ బాహుబలి ‘ ఇంకా టాలీవుడ్ లో టాప్ రేంజిలో కొనసాగుతోంది. ఇక మరో ‘ లేటెస్ట్ అపర బాహుబలి ‘ ప్రభాస్ తాజా చిత్రం ‘ సాహో ‘ పైనే అందరి కళ్ళూ ! సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్టు 15 న రిలీజవుతోంది. ఇంతకీ ఈ హాలీవుడ్ […]

' బాహుబలి ' ని ' సాహో ' బీట్ చేస్తాడా ..?
Follow us

|

Updated on: Jun 14, 2019 | 4:48 PM

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి.. బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టిన రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్ ల చిత్రం ‘ బాహుబలి ‘ ఇంకా టాలీవుడ్ లో టాప్ రేంజిలో కొనసాగుతోంది. ఇక మరో ‘ లేటెస్ట్ అపర బాహుబలి ‘ ప్రభాస్ తాజా చిత్రం ‘ సాహో ‘ పైనే అందరి కళ్ళూ ! సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆగస్టు 15 న రిలీజవుతోంది. ఇంతకీ ఈ హాలీవుడ్ స్థాయి చిత్రంలో ఏముంది ? అత్యద్భుత గ్రాఫిక్స్, కంప్యూటర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రధ్ధాకపూర్ హీరోయిన్. ఈ మూవీ నిర్మాణ బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు.. హైదరాబాద్ సహా ముంబై, అబుదాబీ, రుమేనియా, యూరప్ లోని అందమైన లొకేషన్లలో, ఒళ్ళు జలదరించే స్పాట్లలో షూటింగ్ జరుపు కుందీ సినిమా. 2017 ఆగస్టులో షూట్ లాంచ్ అయిన ‘ సాహో ‘ లో యాక్షన్ సీన్లకు కొదవలేదు. ఈ చిత్రంలోని అండర్ వాటర్ సీక్వెన్సెస్ కోసం ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నాడు. పైగా హిందీ భాష కూడా నేర్చుకుంటూ వచ్చాడు. మొదట శంకర్ ఎహసాన్ లాయ్ సౌండ్ ట్రాక్ బాగానే ఉందని అనుకున్న డైరెక్టర్.. ఆ తరువాత అదనంగా మరికొన్ని సాంగ్స్ ను షూట్ చేయాలనుకోవడంతో.బహుశా అలిగి శంకర్ ఎహసాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. లిరిక్స్ ని తెలుగులో శ్రీమణి రాస్తే,, తమిళంలో మదన్ కర్కీ , హిందీలో జావేద్ అఖ్తర్ తమ కలాలకు పదును పెట్టారు. హిందీ వెర్షన్ కోసం ప్రభాస్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడట. ప్రభాస్ కి ఇది మొదటి హిందీ మూవీ అయితే శ్రధ్ధాకపూర్ కి తొలి తెలుగు చిత్రం. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, చుంకీ పాండే, మందిరా బేడీ వంటి బాలీవుడ్ యాక్టర్స్ నటించారిందులో. విలన్ గా నీల్ నితిన్ యాక్షన్ కూడా సూపర్బ్ అనే టాక్ వచ్చింది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద తీసిన కొన్ని సీన్స్ కోసం రూ. 25 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. తన పాత్రలకు అనువుగా ప్రభాస్.. కార్డియో వాస్క్యులర్ ట్రెయినింగ్ తో బాటు వెయిట్ ట్రైనింగ్, ప్లయో మెట్రిక్ ఆబ్స్టికల్ రేసెస్ లాంటి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడంటే ‘ సాహో ‘ రేపే దుమ్మును ఇప్పటినుంచే అంచనా వేసుకోవలసిందే. ఈ సినిమాలో ప్రభాస్.. ఫిక్షియస్, పైగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. చిత్రం చివరి వరకూ అతడో పోలీసు ఆఫీసర్ అన్న విషయం తెలియనివ్వకుండా డైరెక్టర్ సస్పెన్స్ లో పెట్టేశాడు. చివర్లో రివీల్ అవుతుందీ విషయం. ఇక-2017 ఏప్రిల్ 27 న ఈ మూవీ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రభాస్ బర్త్ డే అయిన 2018 అక్టోబర్ 22 న విడుదలయ్యాయి.మరో పోస్టర్ ఈ ఏడాది మే 21న రిలీజైతే.. వారం తరువాత ఇంకొక పోస్టర్, అనంతరం జూన్ 10 న శ్రధ్ధాకపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయ్యాయి. ప్రభాస్ మరో పోస్టర్ జూన్ 19 న, ఆ మరుసటి రోజున టీజర్ విడుదలయ్యాయి. ఇలా ఈ చిత్రంపై భారీ అంచనాలకు తావిస్తూ మేకర్స్ చేసినప్రమోషన్ కార్యక్రమాలు.. సహజంగానే ఫ్యాన్స్ ని రంజింపజేస్తూ వచ్చాయి. వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారంటే ఎదురు చూడరూ మరి ?

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..