ఇది ముమ్మాటికి శుభసంకేతమే: హర్షవర్ధన్

కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ శుభవార్త. ఏంటంటే.. భారత్‌లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతోన్న సమయం పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి

ఇది ముమ్మాటికి శుభసంకేతమే: హర్షవర్ధన్
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 2:31 PM

కోవిద్-19 విజృంభణ.. లాక్ డౌన్ పొడిగింపు.. సామాజిక దూరం.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ శుభవార్త. ఏంటంటే.. భారత్‌లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పడుతోన్న సమయం పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. గడచిన 14 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 6.2 రోజులు పట్టేదని, గడచిన వారంలో దీనికి 7.2 రోజుల సమయం పట్టిందన్నారు. గడచిన మూడు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు 9.7 రోజులు పడుతోందని చెప్పారు.

కాగా.. ఇది ముమ్మాటికీ శుభసంకేతమన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన హర్షవర్ధన్ కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని గమనించారు. అడ్మిట్ అయిన 177లో 95 మంది రోగులు నేడు డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. రోజురోజుకీ పరిస్థితి మెరుగుపడుతోందని వివరించారు.

[svt-event date=”19/04/2020,2:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: అక్కడ తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. పరుగులు తీయనున్న వాహనాలు..