తప్పుదోవ ప్రకటనలు.. సెలబ్రెటీలకు కౌంటర్!

Bollywood actors who have endorsed junk food and tobacco brands, తప్పుదోవ ప్రకటనలు.. సెలబ్రెటీలకు కౌంటర్!

పిజ్జా, బర్గర్, చిప్స్ ఇలా అనేక రకాల జంక్ ఫుడ్ వెంట పడ్డామంటే.. ఒళ్ళు కొవ్వెక్కడం ఖాయం. ఈ మాట ఎప్పటినుంచో వింటూ వస్తున్నదే! శరీరంలో మోతాదుకు మించి ఫ్యాట్ పెరిగితే ఏర్పడే ముప్పు గురించి కూడా అందరికీ తెలుసు. ఇక వీటికి సంబంధించిన యాడ్స్‌లో చాలామంది స్టార్ హీరోల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు నటిస్తూ.. అభిమానులను ప్రేరేపిస్తుంటారు. ఇక ముందు ఇలాంటి ప్రకటనలలో నటించే ముందు ఒకసారి ఆలోచించాలంటూ ఇండియన్ న్యూట్రిషన్ సంస్థ బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లకు ఓ లేఖ ద్వారా తెలియజేసింది. నిపుణుల అంచనా ప్రకారం యాడ్స్‌లో ఆయా పదార్ధాలలో షుగర్, సాల్ట్ మోతాదు గురించి ప్రస్తావించరని.. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి ప్రముఖులకు ఇండియన్ న్యూట్రిషన్ సంస్థ లేఖ రాస్తూ.. జంక్ ఫుడ్ ప్రకటనల్లో నటించే ముందు ఒకసారి ఆలోచించాలని.. ఆల్కహాల్, గుట్కా, సిగరెట్ వంటి బ్రాండ్లకు దూరంగా ఉండాలని కోరింది.

సెలబ్రిటీలు.. వారు మద్దతు తెలిపే బ్రాండ్ల గురించి పూర్తి అవగాహనతో ఉండమని ఈ సంస్థ కోరడం ఇదేం మొదటిసారి కాదు.. 2016లో డీజే గ్రూప్ సంస్థ.. హాలీవుడ్ నటుడు పియర్స్ బ్రోస్నాన్‌ను తమ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసడర్‌గా ఉపయోగించారు. ఇక అప్పట్లో అది పెద్ద దుమారానికే దారి తీసింది.

ఎడ్వర్‌టైజింగ్ ఇండస్ట్రీ వాచ్ డాగ్, ఎడ్వర్‌టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ అఫ్ ఇండియా.. 2016లో పాన్ మసాలా ఉత్పత్తులపై కంప్లెయింట్స్‌ను పరిశీలించి ఎఎస్సిఐ కోడ్ ఆధారంగా వాటి ప్రకటనలను నిషేదించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇప్పుడు కూడా ప్రజలను తప్పుదోవకు ప్రేరేపించేలా ఉన్న ప్రకటనలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *