Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

55 ఏళ్ల తర్వాత విమానప్రమాదపు ఆసక్తికరమైన అవశేషం దొరికింది

వియెన్నాలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న హోమీబాబాను అమెరికానే కుట్రపూరితంగా చంపేసి ఉంటుందని ఇప్పటికీ చాలామంది బలంగా నమ్ముతుంటారు
Plane crash, 55 ఏళ్ల తర్వాత విమానప్రమాదపు ఆసక్తికరమైన అవశేషం దొరికింది

అది 1966వ సంవత్సరం, జనవరి 24వ తేదీ… ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 707 విమానం ముంబాయి నుంచి న్యూయార్క్‌ నగరానికి బయలుదేరింది.. ఫ్రాన్స్‌ ఇటలీల సరిహద్దులలో ఉన్న మోంట్‌బ్లాంక్‌ దాటే సమయంలో కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 117 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ ప్రమాదం గురించి ఇప్పటివారికి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఈ ప్రమాదం పెను సంచలనాన్ని రేపింది.. కారణం ఆ విమాన ప్రమాదంలో భారత అణు పితామహుడు హోమీ బాబా కూడా మరణించడం .. ఇది అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ పనేనన్న అనుమానాలు వచ్చాయి.. వియెన్నాలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న హోమీబాబాను అమెరికానే కుట్రపూరితంగా చంపేసి ఉంటుందని ఇప్పటికీ చాలామంది బలంగా నమ్ముతుంటారు.. ఇందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా కొందరు సంపాదించారు.. అంతకు ముందు

1950లో కూడా ఎయిర్‌ ఇండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలిపోయింది.. ఆ దుర్ఘటనలో 48 మంది కన్నుమూశారు. ఈ రెండు ప్రమాదాలు జరిగినప్పుడు ఆవశేషాల గుర్తించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి.. మూడేళ్ల కిందట కొన్ని మానవ శకలాలను ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్‌ పర్వతాలపై గుర్తించారు.. ఆల్ఫ్స్‌ పర్వతాల్లోని మాంట్‌ బ్లాక్‌ హిమానీ నదం కరుగుతున్నప్పుడల్లా ఆ విమానప్రమాదాలకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి.. .. ఇప్పుడు మళ్లీ 1966లో జరిగిన ప్రమాదానికి సంబంధించి కొన్ని కొన్ని అవశేషాలు దొరికాయి.. తాజాగా 1966 నాటి నేషనల్‌ హెరాల్డ్‌, ది ఎకనామిక్‌ టైమ్స్‌ న్యూస్‌ పేపర్ల కట్టలు దొరికాయి. అప్పుడు విమాన ప్రమాదం జరిగినప్పుడు ఈ వార్త పత్రికల కట్టలు నదిలో పడి ఉంటాయని అనుకుంటున్నారు.. 55 ఏళ్లు దాటినప్పటికీ ఈ వార్త పత్రికలు ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం.

తిమోతీ మోటిన్‌ అనే రెస్టారెంట్ యజమానికి ఈ న్యూస్‌ పేపర్లు దొరికాయి.. చామోనిక్స్‌ స్కీయింగ్‌ హబ్‌ సమీపంలో లా కాబెన్‌ డు సెరో అనే కాఫీ రెస్టారెంట్‌ను తిమోతీ మోటిన్‌ నడుపుతున్నాడు.. బోసన్స్‌ హిమానీ నదానికి దగ్గర్లోనే ఉంది ఈ రెస్టారెంట్‌.. ఈ పేపర్లు దొరికినందుకు పెద్ద నిధి చేతికందినంతగా తెగ హాప్పీ ఫీలవుతున్నాడు తిమోతి.. పేపర్లు ఎండిన తర్వాత చక్కగా చదువుకోవచ్చని చెబుతున్న తిమోతీ వాటిని సందర్శనకు కూడా పెడతానంటున్నాడు. ఆ పేపర్లలో ప్రధానవార్త ఇందిరాగాంధీ గురించి కావడం, ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అన్నది పతాకశీర్షిక కావడం విశేషం..

Related Tags