బ్రేకింగ్‌.. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో భూకంపం

ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రపంచ దేశాలపై కన్నెర్ర చేస్తోంది. గత కొద్ది రోజులుగా భూకంపాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని..

  • Tv9 Telugu
  • Publish Date - 3:23 am, Wed, 8 July 20
బ్రేకింగ్‌.. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో భూకంపం

ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రపంచ దేశాలపై కన్నెర్ర చేస్తోంది. గత కొద్ది రోజులుగా భూకంపాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. గత కొద్ది రోజులుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వరుసగా భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బుధవారం తెల్లవారు జామున 2.12 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 4.3 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఇదిలావుంటే. సోమవారం నాడు లడాఖ్‌ ప్రాంతంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. అంతకు ముందు ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ సరిహద్దులో కూడా భూకంపం సంభవించింది.

 

An earthquake of magnitude 4.3 on the Richter scale occurred near Rajouri in Jammu and Kashmir at 02:12:20 (IST) today: National Centre for Seismology

— ANI (@ANI) July 7, 2020