ఒక ఆపిల్ పండులో 100 మిలియన్ల బ్యాక్టీరియా!

An apple carries, ఒక ఆపిల్ పండులో 100 మిలియన్ల బ్యాక్టీరియా!

రోజుకో ఆపిల్ తింటే అనారోగ్యం దరి చేరదనే సంగతి తెలిసిందే. ఆపిల్ పండ్లలో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలని భావించే వారికి ఆపిల్ తినాలని సూచిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇష్టంగా ఆరగించే ఈ యాపిల్‌ పండు గురించి తాజా అధ్యయనమొకటి సంచలన విషయాలు బయటపెట్టింది. 240 గ్రాముల బరువున్న ఆపిల్‌లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని తెలుసా? ఈ బ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆపిల్‌ పండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ పండ్లను ఆర్గానిక్, సంప్రదాయ పద్ధతుల్లో పండిస్తారు. ఈ రెండింటిలోనూ బ్యాక్టీరియా ఉంటుంది.

ఆపిల్ పండ్లలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా గింజల్లోనే ఉంటుంది. తర్వాత పల్ప్‌లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటుంది. మన పేగులకు మంచి బ్యాక్టీరియా అవసరం కూడా. ఆర్గానికి ఆపిల్ పండ్లలో పేగులకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆర్గానిక్ ఆపిళ్లలో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి ఎంతో అవసరం.

సేంద్రియ యాపిల్‌తో పోలిస్తే సాధారణ యాపిల్‌లో హానికర బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణ ఫలాల్లో ఎశ్చరీషియా షిజెల్లా వంటి హానికర బ్యాక్టీరియా ఉందని, సేంద్రియ ఫలాల్లో వాటి జాడే కనిపించలేదని తెలిపారు. సేంద్రియ యాపిల్‌లలో మిథైలోబ్యాక్టీరియం, లాక్టోబాసిల్లై వంటి మేలురకం బ్యాక్టీరియా అధికంగా కనిపించిందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *