హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

an analysis on howdymodi event in texas..houston, హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

టెక్సాస్ లోని హూస్టన్ లో ఘనంగా జరిగింది హౌడీమోడీ ఈవెంట్.. మోడీతో అధ్యక్షుడు ట్రంప్ ఒకే వేదికను పంచుకున్నారు. దాదాపు 50 వేలమంది ప్రవాస భారతీయులు హాజరైన ఈ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయానికి యుఎస్ తో బాటు ఇతర ఫారిన్ మీడియా కూడా అంతే ‘ ఘనంగా ‘ కవరేజీ ఇచ్చాయి. 2020 లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్ళీ అధికార పీఠమెక్కేందుకు మోడీ ఈ ఈవెంట్ సందర్భంగా పూర్తి మద్దతు ప్రకటించారు. ‘ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ ‘ (ఈసారీ ట్రంప్ ప్రభుత్వమే) అని ఆయన అందరి ఛీర్స్ మధ్య ప్రకటించారు. అటు ట్రంప్ కూడా భారత్ లో మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఇతర ‘ ప్రజా ప్రయోజనాలను ‘ అదే స్థాయిలో ఆకాశానికెత్తేశారు. వీరి పరస్పర ప్రశంసలను మీడియా బాగానే హైలైట్ చేసింది. అదే సమయంలో పూలు వెనుకే ముళ్ళు కూడా ఉన్నట్టు వీరి ‘ పోకడ ‘ విమర్శలకు కూడా తావిచ్చింది. ఈ ర్యాలీకి ముందు.. యుఎస్ సెనెటర్, వచ్ఛే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెర్నీ సాండర్స్.. ఓ డైలీకి రాసిన లేఖలో.. మోదీ, ట్రంప్ మధ్య పెరుగుతున్న స్నేహతత్వం, భారత, అమెరికా ప్రజలమధ్య బలపడుతున్న అనుబంధం గురించి చాలా విన్నామని, కానీ మన కళ్ళముందే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే మనం మౌనంగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నామని అన్నారు. ఇది అంగీకారయోగ్యమా అని ప్రశ్నించారు. అంతేకాదు.. ‘మతపరమైన అసహనం, అణచివేత, బ్రూటాలిటీ, డేంజరస్ మెసేజ్ ల వంటివి ప్రపంచం చుట్టూ గల ఇలాంటి ఆటోక్రటిక్ (నిరంకుశ) నాయకుల ధోరణిని ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూడండి ! గో ఏ హెడ్ ! యు కెన్ గెట్ ఇన్ విత్ ఇట్ ! ‘ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.

an analysis on howdymodi event in texas..houston, హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

ఇక ఈ ఇద్దరు నాయకులూ(ట్రంప్, మోడీ) ఒకే నాణానికి రెండు వైపులా ఉన్న బొరుసు వంటి వారు ‘ అని హూస్టన్ యునైట్ లోని సౌత్ ఏషియన్ యూత్ మెంబర్ సారా ఫిలిప్స్ అభివర్ణించారు. సిఎన్ఎన్ కి ఇఛ్చిన ఓపెన్ ఎడిటోరియల్ లో ఆమె ఈ మేరకు ప్రస్తావించారు.
‘ మల్టీ కల్చరలజిం (బహుభాషా సాంస్కృతిక సంబంధాలు),మమేకం (ఇంక్లూజన్) అనే పదాల పేరిట ఈ సిటీకి వఛ్చిన మోడీని చూడడం సిగ్గుచేటని అన్నారు. 2014 లో మోడీ మొదట ప్రధానిగా ఎన్నికైనప్పటినుంచీ హిందూ నేషనలిస్ట్ సెంటిమెంట్లకు పాపులర్ అయ్యారని సెటైరిటికల్ గా పేర్కొన్నారు. మోడీని కౌగలించుకునే బదులు.. భారత దేశ వ్యాప్తంగా..ముఖ్యంగా కాశ్మీర్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు ఆయనను జవాబుదారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్.. మోడీకి ‘ బాకా ‘ గా మారారని న్యూయార్క్ టైమ్స్ కు చెందిన వ్యాసకర్త మైఖేల్ డి.షేర్ అభివర్ణించారు. అసలు మోడీ అమెరికా వచ్చింది ఇక్కడి పెట్టుబడులను ఆకర్షించడానికేనని, గత కొన్నేళ్లుగా భారతఆర్ధిక స్థితి దారుణంగా ఉందని మైఖేల్ అన్నారు. మోదీ లక్ష్యం ఇదే అని పేర్కొన్నారు.

an analysis on howdymodi event in texas..houston, హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

హూస్టన్ లో జరిగిన మోడీ ర్యాలీలో ట్రంప్ ‘ అసాధారణమైన ‘ వార్మప్ యాక్ట్ ‘ ( మితిమీరిన బిల్డప్) ఇవ్వడమేమిటని ‘ వాషింగ్టన్ పోస్ట్ ప్రశ్నించింది. భారత దేశం నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం వంటి వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో.. ట్రంప్ ప్రభుత్వంతో ఏర్పడిన ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ఇండియా మార్గాలు వెతుకుతోందని, అందులో భాగంగానే మోడీ ఇక్కడికి వచ్చారని ఫిలిప్ రక్కర్ అనే వ్యాసకర్త ఈ డైలీలో పేర్కొన్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్, అసోసియేటెడ్ ప్రెస్ వంటివి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యానాలే చేశాయి.

an analysis on howdymodi event in texas..houston, హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

ఇక..  ట్రంప్ ఈ కార్యక్రమాన్ని తన ‘ సొంత ఈవెంట్ ‘ గా భావిస్తున్నట్టు కనబడుతోందని, ఇండియాకు చెందిన మోడీకి ఆయన రెండో ‘ బాకా ‘ ఉదారని, ట్రంప్ ఫెమిలియర్ ట్యూన్ సేమ్ టు సేమ్ ఉందని ‘ న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది.’ జనాలు పెద్ద సంఖ్యలో వస్తే ఆ కార్యక్రమాన్ని వృధా చేసుకోవడమెందుకు ? హూస్టన్ లోని ఎన్ ఆర్ జీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్ తనకూ కలిసొస్తుందని ట్రంప్ భావించినట్టున్నారు.. అందుకే .. నాకన్నా మీకు మరింత బెటర్ (‘ఉత్తముడైన ‘)   ఫ్రెండ్ (అధ్యక్షుడు) దొరకబోరు.. మీకిదే చెబుతున్నాను ‘ అని మోడీని ఉద్దేశించి ట్రంప్ అనడమే దీనికి సాక్ష్యం’ అని ఈ పత్రిక పేర్కొంది. ఆసియా [పసిఫిక్ ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవాలని తహతహలాడుతున్నప్పుడు ఈ రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలూ ఆ విషయాన్ని ఎందుకు గ్రహించవని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రశ్నించింది. నిజానికి ట్రంప్ కన్నా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీన్ని బాగా గమనించారని ఈ జర్నల్ అభిప్రాయపడింది.

an analysis on howdymodi event in texas..houston, హౌడీమోడీ ఈవెంట్.. ఫారిన్ మీడియా ఏమంటోంది ?

అయితే పెద్ద డైలీలు ట్రంప్ పట్ల మెతకగా స్పందించడం విశేషం. గతంలో మీడియా తనకు ప్రతికూలంగా వార్తలు రాస్తోందని ట్రంప్ సారు అగ్గిమీద గుగ్గిలమైన విషయాన్ని ఇవి విస్మరించలేదు. అందుకే ఈ కార్యక్రమం పట్ల ఆయన పట్ల కాస్త దూకుడుగా కాకుండా ‘ గౌరవప్రదమైన ‘ రీతిలో స్పందించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *