Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లు.. ఏనాటివి ?

an analysis on encounters in ap and telangana, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లు.. ఏనాటివి ?

దిశ కేసులో నిందితులు నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై ఇంకా మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘ జై సజ్జనార్ ‘, ‘ జై పోలీస్ ‘ అన్న నినాదాలతో ప్రజలు పోలీసులపై పూల వర్షం కురిపించారు. పోలీసుల చర్యతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. లీగల్ నిపుణులు, కొన్ని వర్గాల వారు, పౌర హక్కుల సంఘాల సభ్యులు .. ఖాకీలు మళ్ళీ ప్రమాదకర ఒరవడికి శ్రీకారం చుట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా న్యాయం కోసం ప్రజలు డిమాండ్ చేశాక.. క్రిమినల్స్ ని ఎన్ కౌంటర్ చేయడం పరిపాటి అయింది.

అసలీ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది ?an analysis on encounters in ap and telangana, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లు.. ఏనాటివి ?1968… 71 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో రైతుల తిరుగుబాటు జరిగింది. సాయుధ పోరాటం పేరిట జరిగింది ఇది.. 1973 లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం జలగం వెంగళరావు ఈ పోరాట రైతుల ఎన్ కౌంటర్ కు ఆదేశాలిచ్చారు. ఈ రైతుల్లో చాలామంది నాటి నిషిధ్ధ పీపుల్స్ గ్రూప్ నకు చెందినవారు. అంటే ఎన్ కౌంటర్ కిల్లింగ్స్ కి ఆదేశాలిచ్చిన ఆద్యుడు జలగం వెంగళరావని నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి తరచు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1978 లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పీపుల్స్ గ్రూప్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. 1983 లో నాటి సీఎం నాటి సీఎం ఎన్టీ రామారావు సీఎం అయిన అనంతరం ఎన్ కౌంటర్ హత్యలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే 1995 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ ఈ ట్రెండ్ మొదలైంది. 2003 లో ఆయనపై అలిపిరిలో ఆయనపై మావోయిస్టులు దాడి జరిపారు. ఆ దాడి నుంచి అయన తృటిలో తప్పించుకున్నారు. అయితే 2004 లో అధికారంలోకి వచ్చిన నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎన్ కౌంటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2007 డిసెంబరులో వరంగల్ లో 11 ఏళ్ళ బాలికను కిడ్నాప్ చేసి హతమార్చిన ఏడుగురిలో ముగ్గురిని పోలీసులు కాల్చి చంపారు. అది ఎన్ కౌంటర్ అయినా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆ ఎన్ కౌంటర్ జరగడానికి మూడు రోజుల ముందే అప్పటి వరంగల్ ఎస్పీ సౌమ్యా మిశ్రా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమావేశంలో నిందితులచేత తాము నేరం చేసినట్టు ఒప్పించారు. ఇక 2008 లో ఇంజనీరింగ్ విద్యార్థినులైన స్వప్నిక, ప్రణీతలపై ముగ్గురు వ్యక్తులు యాసిడ్ దాడి జరిపారు. ఆ ఘటనలో ఒక బాధితురాలు ఆ తరువాత మరణించింది. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురిని అప్పటి వరంగల్ ఎస్పీ సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

2015లో ఎర్రచందనం స్మగ్లర్లుగా అనుమానించిన ఇరవై మందిని చిత్తూరు జిల్లాలో కాల్చి చంపారు. అదే ఏడాది టెర్రరిస్టులుగా భావించిన అయిదుగురు ముస్లిం యువకులను నల్గొండ జిల్లాలో ఎన్ కౌంటర్ చేశారు. ఇలాంటి కేసుల్లో పోలీసులపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా చూడాలని, కేవలం ఆత్మరక్షణ కోసమే నిందితులపై కాల్పులు జరిపినవారిగా పరిగణించాలని కోరుతూ ఏపీ ఐ పీ ఎస్అధికారుల సంఘం ఈ ఏడాది మే నెలలో అప్పటి సి జె ఐ రంజన్ గొగోయ్ కి అప్పీలు చేసింది. అయితే 1996 నుంచి జరిగిన అన్ని ఎన్ కౌంటర్ల పైనా దర్యాప్తు జరిపించాలంటూ పౌరహక్కుల సంఘం కేసు దాఖలు చేయడంతో దాన్ని పోలీసు అధికారుల సంఘం సవాలు చేసింది. 2009 లో ఏపీ హైకోర్టు కీలక తీర్పునిస్తూ.. ఎన్ కౌంటర్లకు బాధ్యులైన అధికారులమీద ఐపీసీ 302 సెక్షన్ కింద తప్పనిసరిగా కేసులు పెట్టాలని రూలింగ్ ఇచ్చింది. అయితే దీన్ని ఏపీ, తెలంగాణ పోలీసు అధికారుల సంఘాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. కానీ.. ఏపీ హైకోర్టు ఇఛ్చిన తీర్పు సక్రమమేనని అత్యున్నత న్యాయస్థానంలో ముగ్గురు జడ్జీలతో కూడిన బెంచ్ పేర్కొంది. కాగా- హైదరాబాద్ ఎన్ కౌంటర్ కేసులో ఇప్పటివరకు ఈ సెక్షన్ కింద ఏ పోలీసు అధికారిపైనా కేసు నమోదు కాలేదు.