పోలీస్ ఎన్ కౌంటర్లు.. మొదట.. ఆ తరువాతి పరిణామాలు

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్లో కాల్చి చంపారు. దీనికి అన్ని వర్గాల ప్రజలనుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది.అయితే.. అసలు ఎన్ కౌంటర్లు సమర్థనీయమేనా ? దీనిపై, న్యాయవ్యవస్థ, కోర్టులు ఏమంటున్నాయి ? ఒక్కసారి విశ్లేషిస్తే.. ఒక ఎన్ కౌంటర్ జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ అంశాన్ని మర్డర్ కేసు కింద పరిగణించాల్సి ఉంటుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఈ కమిషన్ సభ్యులు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి […]

పోలీస్ ఎన్ కౌంటర్లు.. మొదట.. ఆ తరువాతి పరిణామాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 1:36 PM

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్లో కాల్చి చంపారు. దీనికి అన్ని వర్గాల ప్రజలనుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది.అయితే.. అసలు ఎన్ కౌంటర్లు సమర్థనీయమేనా ? దీనిపై, న్యాయవ్యవస్థ, కోర్టులు ఏమంటున్నాయి ? ఒక్కసారి విశ్లేషిస్తే.. ఒక ఎన్ కౌంటర్ జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ అంశాన్ని మర్డర్ కేసు కింద పరిగణించాల్సి ఉంటుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఈ కమిషన్ సభ్యులు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులను మదింపు చేయాల్సి ఉంటుంది. తాము ఆత్మరక్షణ కోసమే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు ఆధారాలు చూపలేకపోయిన పక్షంలో.. సంబంధిత పోలీసు అధికారులను కోర్టులు ప్రాసిక్యూట్ చేయవచ్చు. పైగా మెజిస్టీరియల్ విచారణకు న్యాయస్థానాలు ఆదేశించవచ్చు. ఒక్కోసారి జ్యూడిషియల్ విచారణ కూడా జరుగుతుంది. అలాగే ఎన్ కౌంటర్ కు బాధ్యులైన పోలీసు అధికారులు తమ జాబ్ ని కోల్పోవచ్చు. సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు లేదా జాతీయ మానవ హక్కుల సంఘం గానీ విచారణకు ఆదేశిస్తాయి.

అయిదేళ్ల తరువాత అధికారంలోకి వచ్ఛే పార్టీ ప్రభుత్వాలు ఇలాంటి కేసులను రీఓపెన్ చేయవచ్చు. సంబంధిత అధికారులు వ్యక్తిగత కక్షతో ఈ ఎన్ కౌంటర్ చేశారని నిర్ణయించవచ్చు. ఇందుకు గుజరాత్ లో జరిగిన షొహ్రబుద్దీన్, ఇతర ఎన్ కౌంటర్ కేసులను ప్రస్తావిస్తున్నారు. (ఎనిమిదేళ్ల అనంతరం నాడు అమిత్ షా ను అరెస్టు చేస్తే.. ఆ తరువాత ఆరుగురు పోలీసు అధికారులు బెయిల్ లేకుండా ఐదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు).

రేప్ ఘటనల్లో న్యాయ విచారణ.. సా.. గుతున్న వైనం

రేప్ అన్నది అత్యంత పాశవిక , ఘోర నేరం.. ఇలాంటి ఘటనలు మన న్యాయవ్యవస్థకు సవాలుగానే కాక..కోర్టులు జాప్యం చేయడం వల్ల కూడా నిందితులకు వెసులుబాటుగా మారుతోంది. అత్యాచారామన్నది ఒక మహిళ మౌలిక హక్కులపై జరిగే ఘోర నేరమని, రాజ్యాంగంలోని 21 వ అధికరణం ప్రకారం.. వారి జీవన హక్కును , వ్యక్తిగత స్వేఛ్చను అతిక్రమించే కిరాతకమని సుప్రీంకోర్టు చాలాసార్లు స్పష్టం చేసిందని ఒక వ్యాసకర్త పేర్కొంటున్నారు. రేప్, గ్యాంగ్ రేప్, రేప్ అండ్ మర్డర్ వంటివి సాగుతున్నాయి సమాజంలో మనం జీవిస్తున్నామంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు.

భారత ప్రభుత్వ వెబ్ సైట్ వెలువరించిన డేటా ప్రకారం.. ప్రతి ఏడాదీ అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. గత 15 ఏళ్లలో దేశంలో 3 లక్షల 41 వేల 400 కు పైగా రేప్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రతి సంవత్సరం దోషులకు పడుతున్న శిక్షలు తగ్గడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని ఈ వ్యాసకర్త భావిస్తున్నారు. 2014 లో 36, 735 రేప్ కేసులు నమోదు కాగా.. దోషుల నిర్ధారణ కేసులు కేవలం 6,636 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అలాగే 2015 లో 35, 651 అత్యాచార కేసులకు గాను 7,135 కన్విక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇంకా నమోదు కాని కేసులు చాలానే ఉన్నాయి. ఈ ఏడాదిలోనే చాలా కేసులు రిజిస్టరయ్యాయి. ఏపీలో 16 ఏళ్ళ అమ్మాయిపై అయిదు రోజులపాటు అత్యాచారం జరిగింది. బీహార్ లో కూడా ఓ మైనర్ బాలికపై ఆమె తండ్రి ఎదుటే మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. యూపీ లోని ఉన్నావ్ లో 11 ఏళ్ళ మైనర్ బాలిక మీద, డెహ్రాడూన్ లో మూడేళ్ళ పాప పైన, తెలంగాణాలో తొమ్మిది నెలల పసిపాప పైనా రేప్ లు జరిగాయి. ఇక తాజాగా హైదరాబాద్ శంషాబాద్ లో దిశ పై జరిగిన ఘోరం కూడా ఈ దేశాన్ని కుదిపివేసింది. ఈ విధమైన ఘటనలను అదుపు చేయడానికి ప్రస్తుతమున్న చట్టాలు సరిపోతాయా అన్నదే ప్రశ్న. చట్టంలో మహిళలకు లభించే రక్షణ విధానాలపై వారికి అవగాహన కలిగించడం చాలా ముఖ్యం. వారు కూడా ధైర్యంగా మృగాళ్ల కీచక చర్యలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలి.

నిందితులకు శిక్షపై మన కోర్టులు.. చాలా ఆలస్యంగా విచారణ జరపడం విచారకరం. అందువల్లే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమిస్తున్నారు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ అధికారులు, కోర్టులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విధమైన కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేయడానికి వఛ్చినప్పుడు సంబంధిత పోలీసు అధికారి వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి. అలా చేయకపోవడం వల్లే తాజాగా జీరో ఎఫ్ ఐ ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక బాధితురాలిని తక్షణం వైద్య పరీక్షకు పోలీసులు తీసుకువెళ్లాలి, అనంతరం దగ్గర లోని మెట్రోపాలిటన్ లేదా జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆమెను తీసుకువెళ్లాలి.. మహిళలపై నేరాల అదుపునకు సమగ్రమైన, ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. కోర్టులు కూడా రేప్ వంటి కేసుల విషయంలో అలసత్వం లేకుండా విచారణలు జరిపితే దోషులకు త్వరగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. మన న్యాయవ్యవస్థ మారనంతకాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది.