పీఎంకి బర్డ్ డే విషెస్ చెప్పి.. బుక్కైన సీఎం వైఫ్..

Amruta Fadnavis Calls PM Modi Father Of The Country, పీఎంకి బర్డ్ డే విషెస్ చెప్పి.. బుక్కైన సీఎం వైఫ్..

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత.. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఆమెను చిక్కుల్లో పడేసింది. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానిని జాతిపితగా పేర్కొన్నారు. దీంతో ఆమెపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తున్న మీరు మా అందరికీ ఆదర్శప్రాయం అంటూ ఆమె నిన్న ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చేసిన కాసేపటికే నెటిజెన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మన జాతిపిత మహాత్మాగాంధీ కదా.? మరి ఇప్పుడు కొత్తగా ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ ఏంటి..? ప్రధాని మోడీ ఎప్పుడు ఫాదర్ ఆఫ్ కంట్రీ అయ్యారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడే కాదు అంతకుముందుకు కూడా ఇలాగే ట్వీట్ చేసి ఆమె చిక్కుల్లో పడ్డారు. గతంలో సముద్రంలో నౌక అంచున కూర్చుని సెల్ఫీ తీసుకున్న ఆమె.. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇలాంటి ప్రమాదకరమైనవి ఎవరైనా చేస్తారా..? పైగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత తాను క్షమాపణ కూడా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *