జనవరి నుంచి అమ్మఒడి పథకం అమలు.. అర్హులు వీరే!

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదముద్ర లభించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు పేద విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తల్లి లేని పిల్లల విషయంలో వాళ్ళ సంరక్షకులకు ఈ ఆర్ధిక […]

జనవరి నుంచి అమ్మఒడి పథకం అమలు.. అర్హులు వీరే!
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 10:21 AM

పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదముద్ర లభించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు పేద విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తల్లి లేని పిల్లల విషయంలో వాళ్ళ సంరక్షకులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

అమ్మ ఒడి పథకం అర్హతలు, కేటాయించిన బడ్జెట్ వివరాలు…

  1. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు అమ్మఒడి పధకానికి అర్హులు.
  2. వచ్చే ఏడాది జనవరి నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలోకి అమ్మఒడి పథకం ఆర్ధిక సహాయం పడుతుంది.
  3. అమ్మఒడి పథకం కింద ప్రతి ఏటా రూ.15,000 అందజేస్తాం.
  4. పథకం అమలు కోసం రూ.6,450 కోట్లు కేటాయింపు