Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

రివ్యూ: ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’… వర్మ విసిగించాడా..?

Ram Gopal Varma Movie Telugu Review, రివ్యూ: ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’… వర్మ విసిగించాడా..?

టైటిల్ : ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’

తారాగణం : అజ్మల్ అమీర్, బ్రహ్మనందం, అలీ, కత్తి మహేష్, ధన్‌రాజ్ తదితరులు

సంగీతం : రవి శంకర్

నిర్మాత : రామ్ గోపాల్ వర్మ

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సిద్ధార్థ తాతోలు

విడుదల తేదీ: 12-12-2019

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా అన్ని అవరోధాలను ఎదుర్కొని ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీ పొలిటికల్ అంశాలను మేళవించి వర్మ రూపొందించిన ఈ చిత్రం జనాలను ఏమేరకు మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం..

కథ‌ :

సార్వత్రిక ఎన్నికల్లో బాబు వెలుగుదేశం పార్టీపై ఆర్.సీ.పీ పార్టీ భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించింది. దీనితో ఆర్.సీ.పీ పార్టీ అధినేత జగన్నాధ్ రెడ్డి(అజ్మల్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఇక ప్రజలకు తాను ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తూ.. ప్రజాదారణ చూరగొంటారు. ఇదిలా ఉంటే అధికారం కోల్పోయిన బాబు, ఆయన కొడుకు అధికార పార్టీనే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటారు.

ఈ నేపథ్యంలో బాబును ఇటువంటి దీన పరిస్థితుల్లో చూడలేని ఆయన ప్రధాన అనుచరుడు దయనేని రమా.. జగన్నాధ్ రెడ్డిపై కుట్రలు పన్నుతాడు. ఆ క్రమంలోనే అతడు బెజవాడ నడిరోడ్డుపై దారుణ హత్యకు గురవుతాడు. ఇంతకీ రమాను హత్య చేయించింది ఎవరు.? అంతేకాకుండా మధ్యంతర ఎన్నికలకు దారి తీసిన సంఘటనలు ఏంటి.? ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచారు.? ఈ రాజకీయ చదరంగంలో పీపీ జాల్, మనసేన అధినేత ఏయే పాత్రలు పోషించారు.? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే చిత్రం వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

వాస్తవానికి అద్దం పట్టేలా రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరును దర్శకుడు చూపాడు. అనేకమంది ప్రముఖల పాత్రలను పోలిన పాత్రలను వ్యంగ్యంగా చూపిస్తూ కొన్ని చోట్ల కామెడీకి ప్రాధ్యానత ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ముఖ్యమంత్రి జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ పూర్తిగా జీవించేశాడు. ముఖ్యంగా జగన్ బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్ని అద్భుతంగా పలికించి ఆకట్టుకున్నాడు.

బాబు పాత్రధారి.. అచ్చంగా ఆయన హావభావాలను ఒలికించాడు. స్పీకర్‌గా అలీ, సీబీఐ ఆఫీసర్‌గా కత్తి మహేష్, చిన్నబాబుగా చేసిన నటుడు, పీపీ జాల్‌గా నటించిన వ్యక్తి, మనసేన అధినేతగా అనుకరించిన నటుడు.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుత రాజకీయ నాయకులను ఇమిటేట్ చేస్తూ కొన్ని చోట్ల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారని చెప్పాలి.

ఈ సినిమా మొత్తం వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందినా.. ముఖ్యంగా ఓ పార్టీని, ఓ నాయకుడిని టార్గెట్ చేయడంతో ఓ వర్గం ప్రేక్షకులకు అంతగా రుచించదు. అంతేకాకుండా సినిమాలో చాలా సన్నివేశాలు కృతకంగా ఉండటం పెద్ద మైనస్. మరోవైపు వర్మ రొటీన్ స్క్రీన్ ప్లే.. స్లో నేరేషన్‌తో ప్రేక్షకులు విసుగు చెందుతారు. కాగా, చినబాబు భార్య పాత్రకు సంబంధించిన ఓ ట్విస్ట్ దారుణంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం:

రవి శంకర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. జగదీశ్.సి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ఎడిటింగ్ ఎబోవ్ యావరేజ్. ఇక నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని చెప్పాలి.