ఆరోగ్య నిధి ఉ”సిరి’

Health Advantages of Amla, ఆరోగ్య నిధి ఉ”సిరి’

ఉసిరి పేరుకు తగినట్లుగానే ఎన్నో ఆరోగ్యసిరులు ఈ పండులో దాగివున్నాయి. రోజుకు ఒక్క ఉసిరికాయ తినేవారికి ఆరోగ్యరిత్యా ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయనే గూస్‌బేర్రీ అని కూడా అంటారు. పేరులాగే ఇవి చాల పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే ఉసిరి అనేక సుగుణాలు కలిగిఉంది. పుల్లగా, వగరుగా ఉండే ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో దాదాపు మూడు రెట్లు అధిక ప్రోటీన్లు కలిగి ఉంది.. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉసిరి..శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. కాన్సిపేషన్‌ సమస్య ఉంటే తగ్గుతుంది.
సి విటమిన్‌ అధికంగా ఉన్న ఉసిరికాయలు ఐరన్‌తో పాటు ఇతర ఖనిజాలను శరీరం గ్రహించేలా చేస్తాయి.
– అజీర్ణం, కిడ్నీ సమస్యల్లాంటివి ఉసిరితో తగ్గుతాయి. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
– ఎర్ర రక్తకణాలు పెరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. ఆకలి మందగించడం, నోరు సహించకపోవడం లాంటివి తగ్గుతాయి.
– ఉసిరితో కంటి చూపు మెరుగవుతుంది.  ఆమ్లాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.
– కేశ సంబంధిత సమస్యలకు ఉసిరి సంజీవనిలా పనిచేస్తుంది.
– ఉసిరిక పొడి, స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి తయారు చేసిన ఆయిల్‌..జట్టు సంరక్షణకు అవసరమైన పోషణను అందిస్తుంది.
– ఉసిరిక నూనెతో కుదుళ్లు బలపడి, చుండ్రు సమస్యను అరికట్టి, జుట్టు విరగడం, చిట్లిపోవటం తగ్గిపోయి ఆరోగ్యంగా మెరిసే జుట్టు మీకు లభిస్తుంది.
– ఉసిరిని బాగా నూరి అందులో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం సహజ సౌందర్యంతో మిలమిల మెరుస్తూ ఉంటుంది.
– మెటిమలను మాయం చేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని శరీరం నుండి బయటకు పంపి వృద్ధాప్య ఛాయలను రాకుండా అరికడుతుంది.
– ఇవి కోలెస్ట్ర్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. మెల్లగా బరువు కూడా తగ్గొచ్చు.
– నోటి అల్సర్‌తో బాధపడుతున్న వారు కొంచెం ఉసిరి రసాన్ని నీతితో కలిపి పుకిలిస్తే అల్సర్స్‌ తగ్గుతాయి.
– కీళ్లనొప్పులు ఉంటే ఉసిరిని రోజు తీసుకోవటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.
ఉసిరికాయలు తిన్నా,జ్యూస్‌లుగా వాడిన మేలే.. కనుక ఉసిరికాయల సీజన్లో ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *