అమితాబ్ మరో క్రేజీ రోల్..లారెన్స్ కోసం హిజ్రా పాత్ర?

ముంబయి: బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ హిజ్రా పాత్రలో నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘కాంచన’ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో రాఘవ లారెన్స్‌ డైరక్టర్‌గా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటించనున్నారు. అక్షయ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తున్నారు.

View this post on Instagram

First Day of #LAAXMIBOMB 💥 @shabskofficial @akshaykumar #raghavalawrence @tusshark89 and the journey has just begun 👻🔥

A post shared by KIARA (@kiaraaliaadvani) on

అయితే ‘కాంచన’ చిత్రంలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ హిజ్రా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ రోల్ ఆడియెన్స్‌ను విపరీతంగా మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్ రీమేక్‌లో అమితాబ్‌ బచ్చన్‌ హిజ్రా పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే అమితాబ్‌ పాత్ర గురించి మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాధవన్‌, శోభితా ధూలిపాళ్ల కీలక పాత్రలు పోషించనున్నారు. 2020లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *