Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

అమితాబచ్చన్‌కు దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారం

Dadasaheb Phalke award, అమితాబచ్చన్‌కు దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారం

ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఈసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ను వరించింది. ఈ అవార్డు కోసం  బిగ్​బీని ఏకగ్రీవంగా ఎంపికచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. అమితాబ్ ఇప్పటివరకు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. 4 జాతీయ పురస్కారాలు, 15 ఫిల్మ్​ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన యాంగ్రీ యంగ్​మన్​గా పేరు తెచ్చుకున్నారు. కాలానికి తగినట్లు పాత్రలు ఎంచుకుంటూ నటనలో నూతన మైలురాళ్లు అందుకున్నారు. గొప్ప అవార్డు వరించడంతో భారతీయ చలనచిత్ర ప్రముఖులు బిగ్ బీకి అభినందనలు తెలియజేస్తున్నారు.  సినీ ఇండష్ట్రీలో విశిష్ట సేవలకుగానూ ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. గతేడాది బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు అందజేశారు. అంతకుముందు తెలుగు దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్​ సొంతం చేసుకున్నారు.  తొలిసారిగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు 65 మంది సినీ ప్రముఖులకు ఈ అవార్డును అందజేశారు.