అమితాబ్‌ ఔదార్యం.. వలస కార్మికులకు ఫ్లైట్లు బుక్ చేసిన బిగ్‌బీ..!

కరోనా లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వగ్రామాలకు పంపేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కార్మికుల కోసం బస్‌లు, రైళ్లు, విమానాలు బుక్ చేయడం, ఆహారం అందించడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వీరిలో సోనూసూద్ ముందు వరసలో ఉన్నారు. ఎంతో మంది వలస కార్మికులను స్వగ్రామాలను చేర్చిన సోనూ.. వారి పట్ల రియల్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక తాజాగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. దాదాపు […]

అమితాబ్‌ ఔదార్యం.. వలస కార్మికులకు ఫ్లైట్లు బుక్ చేసిన బిగ్‌బీ..!
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 7:22 AM

కరోనా లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వగ్రామాలకు పంపేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కార్మికుల కోసం బస్‌లు, రైళ్లు, విమానాలు బుక్ చేయడం, ఆహారం అందించడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వీరిలో సోనూసూద్ ముందు వరసలో ఉన్నారు. ఎంతో మంది వలస కార్మికులను స్వగ్రామాలను చేర్చిన సోనూ.. వారి పట్ల రియల్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక తాజాగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. దాదాపు వెయ్యి మంది వలస కార్మికుల కోసం విమానాలకు ఆయన టికెట్లు బుక్‌ చేశారు. అమితాబ్‌ కంపెనీలో మేనిజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్ యాదవ్ విమానాలను బుక్ చేశారు. ఇందులో ఇప్పటికే రెండు విమానాలు గమ్యస్థానాలకు చేరుకోగా.. మరో రెండు విమానాలు ఇవాళ బయలుదేరనున్నాయి.

అయితే కార్మికుల కోసం ఓ రైలును బుక్ చేయాలని బిగ్‌బీ అనుకున్నారని, కానీ కుదరలేదని సన్నిహితులు వెల్లడించారు. కాగా లాక్‌డౌన్ వేళ వలస కూలీలు, నిరుపేదలకు బిగ్‌బీ సాయం చేయడం ఇది తొలిసారేం కాదు. లాక్‌డౌన్ సమయంలో నిత్యం 2000 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆలిండియా ఫిలిం ఎంప్లాయిస్‌ కాన్ఫెడరేషన్‌కి చెందిన నిరుపేదల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ ఉచితంగా పంపిణీ చేశారు. టాలీవుడ్‌ సినీ కార్మికుల కోసం కూడా డబ్బును విరాళంగా ఇచ్చారు. అంతేకాదు మొన్నటికి మొన్న 300 మంది వలస కార్మికుల కోసం 10 బస్సులను ఆయన సమకూర్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన చేసిన సాయంపై వలస కార్మికులు తమ కృతఙ్ఞతలను తెలుపుతున్నారు.

Read This Story Also: ఆరు నెల‌ల్లో 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు ప్ర‌ణాళికః యోగి