ఈ ఫొటోలో ఉన్న అమ్మాయెవరో తెలుసా..?

బిగ్‌బీ ఓ ఆసక్తికరమైన, పాత కాలం నాటి ఫొటో ఒకటి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..? ఓ అగ్ర హీరోయిన్.. గుర్తు పట్టండి..? తను ఎవరో కాదు ‘కరీనా కపూర్’. గోవాలో ‘పుకార్’ సినిమా షూటింగ్ సమయంలో సెట్‌కు వచ్చింది. ఆడుకుంటుండగా ఆమె కాలికి గాయమైంది. దానికి మందులు రాసి, బ్యాండేజ్ వేసినప్పుడు తీసిన ఫొటో ఇది అంటూ అమితాబ్ బచ్చన్ వివరించారు. 1983లో పుకార్ సినిమా తీశారు. అప్పట్లో […]

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయెవరో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 4:47 PM

బిగ్‌బీ ఓ ఆసక్తికరమైన, పాత కాలం నాటి ఫొటో ఒకటి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా..? ఓ అగ్ర హీరోయిన్.. గుర్తు పట్టండి..? తను ఎవరో కాదు ‘కరీనా కపూర్’. గోవాలో ‘పుకార్’ సినిమా షూటింగ్ సమయంలో సెట్‌కు వచ్చింది. ఆడుకుంటుండగా ఆమె కాలికి గాయమైంది. దానికి మందులు రాసి, బ్యాండేజ్ వేసినప్పుడు తీసిన ఫొటో ఇది అంటూ అమితాబ్ బచ్చన్ వివరించారు.

1983లో పుకార్ సినిమా తీశారు. అప్పట్లో ఇది పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో అమితాబ్, రణ్‌ధీర్ కపూర్, జీనత్ అమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రమేష్ బెహల్ దర్శకత్వం వహించారు. కాగా.. ప్రస్తుతం బిగ్‌బీ బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 20న విడుదల కాబోతోంది.

https://www.instagram.com/p/BxjIHoIhExa/