ఎగ్జిట్‌ పోల్స్‌: ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు అమిత్ షా విందు

ఎన్డీయే మిత్ర పక్షాల నేతలకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. కేంద్ర క్యాబినెట్‌ భేటీ కూడా అదే రోజు జరగనుంది. ఢిల్లీలో జరిగే ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎన్డీయే 300 సీట్లకుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. […]

ఎగ్జిట్‌ పోల్స్‌: ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు అమిత్ షా విందు
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 30, 2019 | 9:01 PM

ఎన్డీయే మిత్ర పక్షాల నేతలకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మంగళవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. కేంద్ర క్యాబినెట్‌ భేటీ కూడా అదే రోజు జరగనుంది. ఢిల్లీలో జరిగే ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎన్డీయే 300 సీట్లకుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రజలంతా మోదీ పాలనకు జేజేలు పలికారని, అంకిత భావంతో సుపరిపాలన అందించిన మోదీసర్కార్‌కు సానుకూలంగా ప్రజలు ఓటు వేశారని వెల్లడైందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు. అసత్య ఆరోపణలు, అవాస్తవాలను ప్రచారంలో పెట్టిన విపక్షాలకు ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ గుణపాఠమని ఆయన తెలిపారు.