Breaking News
  • 46వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం
  • సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
  • గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీస్‌లో చోరీ
  • రూ.10 లక్షల నగదు అపహరణ, కేసు నమోదు చేసిన పోలీసులు
  • తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు
  • శ్రీనగర్‌: సియాచిన్‌లో మంచుతుఫాన్‌. 18 వేల అడుగుల ఎత్తులో మంచుతుఫాన్‌. మంచుకింద చిక్కుకున్న 8 మంది సైనికులు. నలుగురు సైనికులు సహా ఇద్దరు సహాయకులు మృతి. మరో ఇద్దరు సైనికులకు గాయాలు.

ఆశలు ఆవిరి చేసిన అమిత్ షా..

Amit Shah Telangana tour not yet confirmed, ఆశలు ఆవిరి చేసిన అమిత్ షా..

తెలంగాణలో పాగా కోసం ప్లాన్ చేస్తున్న కమలం నేతలు గతంలో కంటే ఈసారి దూకుడు పెంచారు. నలుగురు ఎంపీలు గెలవడం, ఓటు బ్యాంక్ పెరగడంతో జాతీయ నేతలంతా నజర్ పెట్టారు. ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుని బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో మరింత దూకుడు పెంచేందుకు సెప్టెంబర్ 17 అవకాశాన్ని వినియోగించుకోవాలని భావించినా..ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చకపోవడంతో కన్ఫ్యూజన్ లో పడ్డారు రాష్ట్ర కమలం నేతలు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కొన్నేళ్లుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ రోజు ఏ పార్టీ ఏ విధంగా పాటించినా… బీజేపీ మాత్రం విమోచన దినోత్సవంగా జరుపుకుంటూ వస్తోంది. అయితే ఈసారి అమిత్ షాను పిలిపించి మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశారు స్టేట్ బీజేపీ నేతలు.ఇందుకోసం భారీ బహిరంగకు ప్లాన్ కూడా చేశారు. ఒకే టైంలో ఇటు టీఆర్ఎస్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టడంతో పాటు క్యాడర్ లో జోష్ పెంచాలని స్కెచ్ వేశారు. అయితే సెప్టెంబర్ 17కు మరో మూడు రోజులే సమయం ఉండటం…ఇంకా అమిత్ షా టూర్ ఖరారు కాకపోవడంతో టెన్షన్ పడుతున్నారట కమలం నేతలు.

సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, మోదీ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసింది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఢిల్లీ స్థాయిలోనూ హైప్ తీసుకురావాలనుకున్నారు..అయితే అమిత్ షా షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోవడంతో భారీ కార్యక్రమాలకు బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.