కిషన్‌రెడ్డికి అమిత్‌షా మందలింపు!

కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందిలో పడ్డారు. హైదరాబాద్‌ను ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో హోం శాఖ మంత్రిగా శనివారంనాడే బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా తన డిప్యూటీని మందలించినట్టు తెలుస్తోంది.

దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దొరికినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడం విమర్శలకు తావిచ్చింది. కాగా, ఆయన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్ ఒవైసీ మండిపడ్డ విషయం తెలిసిందే. బాధ్యతగల మంత్రి ఇంత బాధ్యతారహితంగా మాట్లడటం ఏమిటంటూ ఒవైసీ నిప్పులు చెరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *