కశ్మీర్‌పై కదిలిన కేంద్రం.. రేపు పార్లమెంట్‌లో కీలక బిల్లు

Amit Shah Meets NSA Doval in Parliament as Speculation Mounts Over Security Situation, కశ్మీర్‌పై కదిలిన కేంద్రం.. రేపు పార్లమెంట్‌లో కీలక బిల్లు

జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హో శాఖ సహాయ మంత్రి అమిత్ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, “రా” చీఫ్ సామంత్ గోయల్, కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులతో ఆయన సమావేశం అయ్యారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వంటి వాటికి తాజాగా మళ్లీ కశ్మీర్ లోయలో పాల్పడవచ్చునని ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో అమిత్ షా వీరితో భేటీ అయ్యారు. మరోవైపు త్వరలో కశ్మీర్‌ లోయను అమిత్ షా సందర్శించనున్నారని వార్తలు వస్తున్న వేళ.. అటు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ప్రకటనలు పరిస్థితిని మరింత ఆందోళన కరంగా మారుస్తున్నాయి. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని.. గవర్నర్ చేసిన ప్రకటనతో పాటు.. సాక్షాత్తు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిపై కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేయడం విశేషం. దీంతో పాటు ఆర్టికల్ 35ఏ, 370 అధికరణాలను కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా… కశ్మీర్‌లో అమరనాథ్‌ యాత్రను నిలిపివేయడం, అదనపు బలగాల మోహరింపు.. ఆర్టికల్ 370, 35ఏ రద్దుపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వదంతులు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఓ కీలక బిల్లును అమిత్‌షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ ( రెండో సవరణ) బిల్లు -2019 ను ఆయన రాజ్యసభలో ప్రతిపాదించనున్నారు. కశ్మీర్ లోయలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ బిల్లు నిర్ధేశిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *