అరె ! చైనా వారి గేదెలు కూడా మన బోర్డర్లోకి ‘చొచ్ఛుకు వచ్చాయే’ !

లడాఖ్ లో ఓ వైపు చైనా దళాల ఆక్రమణలు కొనసాగుతుండగా మరోవైపు వారి జంతువులు కూడా తామూ తీసిపోమన్నట్టు భారత సరిహద్దులను దాటి ఎంటరవుతున్నాయి. తాజాగా ఆ దేశ బోర్డర్స్ నుంచి 13 గేదెలు, 4 దూడలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి.

అరె ! చైనా వారి గేదెలు కూడా మన బోర్డర్లోకి 'చొచ్ఛుకు వచ్చాయే' !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 08, 2020 | 10:55 AM

లడాఖ్ లో ఓ వైపు చైనా దళాల ఆక్రమణలు కొనసాగుతుండగా మరోవైపు వారి జంతువులు కూడా తామూ తీసిపోమన్నట్టు భారత సరిహద్దులను దాటి ఎంటరవుతున్నాయి. తాజాగా ఆ దేశ బోర్డర్స్ నుంచి 13 గేదెలు, 4 దూడలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈస్ట్ కామంగ్ వద్ద ‘మోహరించి ఉండగా’ మన సైనికులు చూసి వాటిని ‘మానవతా దృక్పథం’తో చైనా దళాలకు అప్పగించారు. ఇందుకు వారు కూడా ‘హృదయపూర్వకంగా’ కృతజ్ఞతలు తెలిపినట్టు భారత ఆర్మీ తెలిపింది. అటు-సరిహద్దుల్లో  ఉద్రిక్తతల నివారణకు సైనిక స్థాయిలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఇండో-చైనా స్టాండ్ ఆఫ్ లో ఈ గేదెల గోల సరికొత్త ఎపిసోడ్ !