కరోనా ఎఫెక్ట్.. ఈ నెల 15 న సింపుల్ గా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఈనెల 15 భారత స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించనున్నారు. కాగా- ఆ రోజున ప్రధాని మోదీ షెడ్యూల్ ని అధికారులు..

కరోనా ఎఫెక్ట్.. ఈ నెల 15 న సింపుల్ గా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 11, 2020 | 7:12 PM

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దృష్ట్యా ఈనెల 15 భారత స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించనున్నారు. కాగా- ఆ రోజున ప్రధాని మోదీ షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు. శనివారం ఉదయం  7.30 గంటలకు ఆయన రెడ్ ఫోర్ట్ పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.ఇది సుమారు 40 నిముషాల నుంచి 90 నిముషాలు ఉండవచ్ఛు. త్రివిధ దళాల సైనిక వందనాన్ని మోదీ స్వీకరిస్తారని, 22 మంది జవాన్లు, సైనికాధికారులు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే నేషనల్ సెల్యూట్ లో 32 మంది సైనికులు పాల్గొంటారు. 350 మంది ఢిల్లీ పోలీసులను నాలుగు వేర్వేరు లైన్లలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి కేవలం 120 మంది గెస్టులను మాత్రమే ఆహ్వానించారు. స్కూలు విద్యార్థులెవరూ పాల్గొనడంలేదు. ఎప్పుడూ స్వాతంత్య్ర దినోత్సవం నాడు వందలాది బాలబాలికలతో రెడ్ ఫోర్ట్ ప్రాంతం కళకళలాడేది. కానీ ఈ సారి ఆ ఊసేలేదు.