ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ!

Amid leadership crisis Congress top brass to meet on Aug 10, ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ!

ఢిల్లీ: ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు, కశ్మీర్‌లో ప్రభుత్వ చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలో సీడబ్ల్యూసీ నిర్ణయించనుంది. రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక ఇది తొలి సమావేశం. తొలుత ఈ నెల 8వ తేదీన సీడబ్ల్యూసీ భేటీ కావాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడగించే అవకాశం ఉండటంతో 10వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *