వెండితెరలు ఇప్పట్లో వెలిగేలా లేవు ..!

ఈ నెల 15 నుంచి సినిమాహాళ్లను, మల్టీప్లెక్స్‌ను సుబ్బరంగా తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆ ఆలోచన చేయడం లేదు.. కొన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్‌ అయినా 50 సీట్ల సామర్థ్యంతో...

వెండితెరలు ఇప్పట్లో వెలిగేలా లేవు ..!
Follow us

|

Updated on: Oct 28, 2020 | 12:29 PM

ఈ నెల 15 నుంచి సినిమాహాళ్లను, మల్టీప్లెక్స్‌ను సుబ్బరంగా తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆ ఆలోచన చేయడం లేదు.. కొన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్‌ అయినా 50 సీట్ల సామర్థ్యంతో నడపడం తమవల్ల కాదని తెరచిన థియేటర్లను మూసేసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు.. కరెంట్ ఖర్చులు, మెయింటైన్స్‌ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలా ఉంటే లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలనే గట్టి నిర్ణయంతో ఉన్న నిర్మాతలు ఇప్పుడా ప్రయత్నంలో పడ్డారు.. సినిమాలను థియేటర్లలో రిలీజ్‌ చేస్తారు సరే… చూట్టానికి ప్రేక్షకులు వస్తారా అన్నదే అనుమానం.. కరోనా వైరస్‌ వ్యాప్తి భయంకరంగా ఉన్న ఇలాంటి సమయంలో జనం థియేటర్లకు వెళతారా? రెండున్నర గంటల వినోదం కోసం లేనిపోని తలనొప్పులు ఎందుకని అనుకుంటారా? ఇలాంటి అనుమానాలే లోకల్‌ సర్కిల్స్‌ వారికి కూడా వచ్చింది.. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా 8,274 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇందులో కేవలం ఏడు శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఉందన్నారు. మళ్లీ ఇందులో నాలుగు శాతం మంది కొత్త సినిమా అయితేనే థియేటర్‌కు వెళ్లి చూస్తామన్నారు.. మిగతా మూడు శాతం మందికి కొత్త పాత అన్న తేడా లేదు.. సినిమా అయితే చాలు థియేటర్‌కు వెళ్లి చూసేందుకు రెడీగా ఉన్నారు. 74 శాతం మంది అసలు థియేటర్‌ ఛాయలోకి వెళ్లమని కరాఖండిగా చెప్పేశారు.. రెండు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు.. మిగిలిన 17 శాతం మంది మాత్రం థియేటర్‌లో సినిమా చూడాలన్న ఆసక్తి, అభిరుచి తమకు లేవని చెప్పేశారు.. ఇదే లోకల్‌ సర్కిల్స్‌ జులైలో నిర్వహించిన సర్వేలో మాత్రం 72 శాతం మంది, ఆగస్టు సర్వేలో 77 శాతం మంది ప్రస్తుతం తాము థియేటర్లకు వెళ్లడానికి సిద్ధంగా లేమన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కోరి ఎందుకు వైరస్‌ను అంటించుకోవడమన్న భావనతో వారున్నారు.. హాయిగా ఇంటిపట్టునే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూసి ఎంజాయ్‌ చేయవచ్చనే భావనతో ఉన్నారు. గత ఏడు నెలలుగా థియేటర్లు మూసే వున్నాయి.. సినిమారంగం బాగా దెబ్బతిన్నది.. సినిమా పరిశ్రమపై ఆధారపడినవారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి.. థియేటర్లలో పని చేసేవారి పరిస్థితి మరీ దారుణం.. జూనియర్‌ ఆర్టిస్టులు ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు..కొందరు కాయాకష్టం చేసి బతుకుతున్నారు. కూలీనాలీ చేసుకుని కడుపునింపుకుంటున్నవారు ఇంకొందరు.. ఇవి చేతకానివారు ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నాటక, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకున్నాయి కానీ ప్రేక్షకులే కరువవుతున్నారు.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు ఎందుకొచ్చిన తలనొప్పులనే అభిప్రాయంతో ఉన్నాయి.. అందుకే థియేటర్ల ఓపెనింగ్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!