Breaking News
  • రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. గడచిన 24 గంటల్లోనే 438 మంది వైరస్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులకు పది ప్రాంతాలు డేంజర్‌ స్పాట్స్‌గా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

‘కరోనా షిప్’ నుంచి అమెరికన్ల తరలింపు ?

Americans Shifted from Daimond Princess, ‘కరోనా షిప్’ నుంచి అమెరికన్ల తరలింపు ?

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది బ్రిటిషర్లు తమను కూడా  ఈ నౌక నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని తమ దేశ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వీరిలో  ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్టు తెలిసింది. ఇద్దరు వృధ్ద బ్రిటిష్ దంపతులు మమ్మల్ని  వెంటనే ఈ నౌక నుంచి తరలించేందుకు విమానాన్ని పంపవలసిందిగా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్ సన్ ను కోరడం విశేషం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేమని వీరు దీనంగా వేడుకుంటున్నారు.

ఈ షిప్ లో 138 మంది భారతీయులు ఉండగా.. వీరిలో ముగ్గురికి ఈ వ్యాధికి సంబంధించిన పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే వారు క్రమేపీ కోలుకుంటున్నారని జపాన్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.  ఈ నెల 19 న వీరిని ఇండియాకు తీసుకువచ్ఛే ఏర్పాట్లు చేయవచ్చు. కాగా-చైనాలో కరోనా మృతుల సంఖ్య 1523 కి చేరింది.

Americans Shifted from Daimond Princess, ‘కరోనా షిప్’ నుంచి అమెరికన్ల తరలింపు ?

 

 

Related Tags