ఫేస్‌బుక్ వద్దంటోన్న అమెరికన్స్

ఫేస్‌బుక్‌ను వాడేవారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పడిపోతోంది. 2017 నుంచి ఇప్పటి వరకూ కోటిన్నర్ర మంది వరకూ యూజర్లు వైదొలిగారు. ఇది అక్కడ చాలా పెద్ద పరిణామం. దీంతో సోషల్ మీడియా దిగ్గజానికి అమెరికాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైదొలుగుతున్నవారిలో ఎక్కువ మంది 12 నుంచి 34 ఏళ్ల మధ్యవారే కావడం ఫేస్‌బుక్‌ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ వయసువారే ఎక్కువగా సోషల్ మీడియాను వాడతారు, కానీ ఇప్పుడు వారే వేగంగా వదిలి వెళ్లిపోవడం ఫేస్‌బుక్‌కు […]

ఫేస్‌బుక్ వద్దంటోన్న అమెరికన్స్
Follow us

|

Updated on: Mar 07, 2019 | 6:54 PM

ఫేస్‌బుక్‌ను వాడేవారి సంఖ్య అమెరికాలో విపరీతంగా పడిపోతోంది. 2017 నుంచి ఇప్పటి వరకూ కోటిన్నర్ర మంది వరకూ యూజర్లు వైదొలిగారు. ఇది అక్కడ చాలా పెద్ద పరిణామం. దీంతో సోషల్ మీడియా దిగ్గజానికి అమెరికాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైదొలుగుతున్నవారిలో ఎక్కువ మంది 12 నుంచి 34 ఏళ్ల మధ్యవారే కావడం ఫేస్‌బుక్‌ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ వయసువారే ఎక్కువగా సోషల్ మీడియాను వాడతారు, కానీ ఇప్పుడు వారే వేగంగా వదిలి వెళ్లిపోవడం ఫేస్‌బుక్‌కు బ్యాడ్ న్యూసే. ఈ వివరాలను ‘ఎడిసన్ రీసర్చ్’ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.

మరి ఫేస్‌బుక్‌ను వదలి వాళ్లు ఏం చేస్తున్నారంటే ఇతర సోషల్ మీడియా మాధ్యమాలపై దృష్టిపెడుతున్నారు. అందులో ఇన్‌స్టాగ్రామ్ మొదటి ప్లేస్‌లో ఉంది. ఇన్స్టాగ్రామ్ కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా ఫేక్ న్యూస్ షేర్ అవుతుండటం, యాడ్స్ ఎక్కువగా వస్తుండటంతో యూజర్లు ఆసక్తి కోల్పోతున్నట్టు రీసెర్చ్ సంస్థ చెప్పింది. వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ బుక్ దుర్వినియోగం చేస్తుందనే అభిప్రాయం కూడా యూజర్లలో ఉంది.