Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

భాషలందు తెలుగు లెస్స.. తెల్లవాడి నోట అచ్చ తెలుగు

American Youth speaks fluent Telugu, భాషలందు తెలుగు లెస్స.. తెల్లవాడి నోట అచ్చ తెలుగు

‘‘దేశ భాషలందూ తెలుగు లెస్స’’.. ‘‘తెలుగు ఈజ్ ది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’’ అంటూ పలువురు మన తెలుగు భాష గురించి ఎప్పుడో గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికత, ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి కావడం లాంటి విషయాలతో మన భాషను మాట్లాడటం మర్చిపోతున్నాం. అయితేనేం విదేశాలలో తెలుగు భాషకు మంచి క్రేజ్ పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో సైతం తెలుగును నేర్చుకునేందుకు పోటీ పడుతున్నారు. అక్కడి తెలుగు వారు ఎక్కువగా ఉంటుండటంతో.. మన భాషను నేర్పే శిక్షకులకు మంచి డిమాండ్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలోని మోంటానా ప్రాంతంలో ఐజాక్ రిచార్ట్స్ అనే వ్యక్తి అచ్చ తెలుగు మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తాడు. అంతేకాదు తన దగ్గరకు వెళ్లిన తెలుగు వారు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. తెలుగు మర్చిపోకండి. అది చాలా మంచి భాష అని హితవు పలికాడు. ఈ సందర్భంగా ఆయన పలికిన తెలుగు మాటలను అక్కడున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. ఇక్కడ బాగా పాపులర్ అయ్యాడు ఐజాక్. అంతేకాదు ప్రముఖ నటి మంచులక్ష్మి ఆయన వీడియోను షేర్ చేస్తూ.. ఓ మై గాడ్.. నా తెలుగు కంటే ఇతని తెలుగు చాలా బావుంది అంటూ కితాబిచ్చారు.

ఇక ఆ వీడియోకు ఆయనకు మన తెలుగు వారు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతుంటే దాంతో తబ్బుబ్బిపోయిన ఐజాక్.. తాజాగా మరో వీడియోను షేర్ చేశాడు. ‘‘ప్రతి మనుషులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బావున్నారా..! నేను ఐజాక్ రిచార్ట్స్‌ని. రీసెంట్‌గా దినేష్ అన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు కదా ఫేస్‌బుక్‌లో. కానీ న్యూస్ స్టేషన్స్ రిపోర్ట్స్ చేసినప్పుడు కొన్ని డిటైల్స్ తప్పుగా చెప్పారు. నేను న్యూజిలాండ్ నుంచి కాదు. నేను యూఎస్‌ఏ నుంచి ఇండియా వచ్చాను. 2016 నుంచి 2018వరకు విజయవాడలో ఒక సంస్థ, విశాఖపట్నంలో ఒక సంస్థలో తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు ఐస్‌క్రీమ్ షాపులో పనిచేస్తున్నాను. ఇక్కడికి చాలామంది ఇండియన్ టూరిస్ట్‌లు వస్తుంటారు. వారితో కొన్నిసార్లు నేను తెలుగులో మాట్లాడుతుంటాను. నా వీడియోను ఒక అమ్మాయి తీసేటప్పుడు ఎందుకు వీడియో తీసుకుంటున్నారు..? అంత పెద్ద తెలుగు నేను ఏం మాట్లాడుతున్నాను. అని అనుకున్నాను. కానీ ఆ వీడియో పోస్ట్ చేశాక దానికి వచ్చిన వ్యూస్‌ను చూసి నమ్మలేకపోయాను. చాలా గొప్ప విషయం. నాకు నిజంగా తెలుగు బాగా నచ్చింది. ఆంధ్రప్రదేశ్‌. ఎల్లప్పుడూ నా గుండె అక్కడ ఉంది. ఇప్పటి నుంచి నేను తెలుగులో కొన్ని జోక్స్ చెబుతాను. లేకపోతే నేను తెలుగు ఎలా నేర్చుకున్నాను.? అనే నా స్టోరీలన్నీ నేను చెబుతాను. ఇండియాలో ఏం జరిగింది.? అక్కడ నేను ఏం చేశాను..? ఈ వీడియో షేర్ చేయండి. ఫేస్‌బుక్‌లో నన్ను ఫాలో అవ్వండి. మళ్లీ చూద్దాం’’ అంటూ ఓ వీడియో మెసేజ్ పెట్టాడు. కాగా తన యూట్యూబ్ అకౌంట్‌కు ఐజాక్ రిచార్ట్స్ తెలుగు మర్చిపోకూడదు అని పెట్టుకోవడం విశేషం.