Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

అనుచరుని ద్రోహం..అల్ బాగ్దాదీ హతం..చివరి నిమిషంలో ఏంజరిగిందంటే ?

close associate leaked information of bagdadi, అనుచరుని ద్రోహం..అల్ బాగ్దాదీ హతం..చివరి నిమిషంలో ఏంజరిగిందంటే ?

ఐసిస్ అధినేత అల్ బాగ్దాదీ ఆచూకీ ఎలా చిక్కింది ? ఎన్నో ఏళ్ళుగా సిరియాను అడుగడుగు జల్లెడ పడుతున్న అమెరికన్ సేనలకు ఇసుమంతైనా ఆచూకీ తెలియకుండా తప్పించుకు తిరుగుతూ.. వీలు చిక్కినప్పుడల్లా మెరుపుదాడులకు పాల్పడుతున్న వేల ప్రాణాలను హరించిన అల్ బాగ్దాదీని అనూహ్యంగా ఎలా ట్రేస్ చేశారు ? ఆదివారం ఈ దాడికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన నుంచి ప్రతీ ఒక్కరి బుర్రను తొలుస్తున్న ప్రశ్న ఇది. అయితే.. బాగ్దాదీ ఆచూకీని తెలిపింది అతని ప్రధాన అనుచరుడేనని తాజాగా ఇరాక్ అధికారులు వెల్లడించారు.

సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బాకర్‌-అల్‌- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్‌ భద్రతా అధికారులు తెలిపారు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్ర సంస్థ ఐఎసిస్ చీఫ్‌ను హతమార్చడంలో అమెరికా సేనలు ఎట్టకేలకు ఆదివారం విజయవంతమయ్యాయంటే ఆ క్రెడిట్ సేనలది కాదు.. బాగ్దాదీకి అతని అనుచరుడు చేసిన ద్రోహమేనని తాజాగా తెలుస్తోంది. చిన్నారులు సహా వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబు బాకర్‌ బాగ్దాదీని తమ సైన్యం చుట్టుముట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్‌ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్‌ భద్రతా అధికారులు ఈ ఆపరేషన్‌లో అబు బాకర్‌ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్‌ అల్‌-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు

రెండు రోజుల ముందే పక్కా ప్లాన్ ?

పిల్లలు, మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్‌కు అమెరికా అధికారులు కైలా ముల్లెర్‌ అని నామకరణం చేశారు. సిరియాలో పనిచేస్తున్న సమయంలో అమెరికా సామాజిక కార్యకర్త కైలాను బాగ్దాదీ కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆమెపై అత్యంత క్రూరంగా అనేకమార్లు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌కు కైలా ముల్లెర్ అని పేరుపెట్టిన అధికారులు గురువారం నుంచే బాగ్దాదీని హతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంలోనూ సఫలీకృతమయ్యారు.

శుక్రవారం తన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్‌ వివాహ వార్షికోత్సవాన్ని జరపడం కోసం ట్రంప్‌ క్యాంప్‌ డేవిడ్‌కు వెళ్లారు. అనంతరం వెంటనే వర్జీనియాకు పయనమై మిలిటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. తర్వాత బేస్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆపరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తైంది.

సీక్రెట్ ఆపరేషన్ స్టెప్ బై స్టెప్..

ఆదివారం వేకువ జామున అమెరికా సైన్యానికి చెందిన ఎనిమిది హెలికాప్టర్లు ఉత్తర ఇరాక్‌ నుంచి బయల్దేరాయి. సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో బాగ్దాదీ ఉన్నాడన్న సమాచారంతో మిడిల్‌ ఈస్ట్‌లో ప్రవేశించాయి. ఇరాక్‌, టర్కీ, రష్యా అధికారులతో సమన్వయమై ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలేవీ చెప్పకుండానే గగనతలాన్ని అదుపులోకి తెచ్చుకోవాలని అమెరికా అధికారులు సూచించారు. బాగ్దాదీ ఉన్న ప్రాంతానికి చేరుకోగానే అమెరికా సైన్యానికి చెందిన రోటార్‌ సీహెచ్‌-47 విమానాలు రెండు అల్‌- అసద్‌ ఎయిర్‌బేస్‌ కేంద్రంగా బుల్లెట్ల వర్షం కురిపించాయి.

ఈ క్రమంలో తన చావు ఖాయమని భావించిన బాగ్దాదీ తమ అండర్‌ గ్రౌండ్‌ బంకర్లలోకి వెళ్లి తల దాచుకున్నాడు. అంతేకాదు అమెరికా సైనికులు తనను సమీపిస్తున్న క్రమంలో ఆత్మాహుతి దాడి జాకెట్‌ ధరించి ముగ్గురు అమాయక పిల్లల్ని తన వెంట తీసుకువెళ్లాడు. అయితే అమెరికా సైన్యానికి చెందిన జాగిలాలు బాగ్దాదీని వెంబడించడంతో బంకర్‌ టన్నెల్‌ చివరికి చేరగానే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో బాగ్దాదీతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు.

చచ్చింది అతడే..

బంకర్‌ పేలిపోవడంతో బాగ్దాదీ హతమైనట్లు గుర్తించిన అమెరికా సైన్యం.. చనిపోయింది బాగ్దాదీ అన్న విషయాన్ని ధ్రువీకరించేందుకు అతడి ఆనవాళ్లు సేకరించారు. ముక్కలైన మృతదేహం నుంచి ఫోరెన్సిక్‌ అధికారులు డీఎన్‌ఏ సేకరించి పరీక్షించగా అది బాగ్దాదేనన్న విషయం స్పష్టమైంది. ఈ విషయం గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ చచ్చింది అతడే. 15 నిమిషాల్లోనే ఫోరెన్సిక్‌ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత బాగ్దాదీని మట్టుబెట్టి మా సైనికులు ఐసిస్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని, ఉగ్రవాదుల తదుపరి ప్రణాళికల గురించి వివరాలు సేకరించారు’ అని పేర్కొన్నారు. కాగా అమెరికా సైన్యం సిరియాలో బాగ్దాదీని అంతం చేసిన వెంటనే అమెరికా ఫైటర్‌ జెట్లు ఆరు రాకెట్లను ఆకాశంలోకి వదిలి తమ విజయాన్ని ప్రపంచానికి తెలియజేశారు.