Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

ట్రంప్ మెడకు అభిశంసన ఉచ్చు.. ఉంటాడా ? పోతాడా ??

trump to face impeachment, ట్రంప్ మెడకు అభిశంసన ఉచ్చు.. ఉంటాడా ? పోతాడా ??
ఒకవైపు వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లోను విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఇంకోవైపు ఆయనను తరుముకొస్తోంది అభిశంసన తీర్మానం. తాజాగా ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిక్యత ఉన్న సభలోని మొత్తం 435 మంది సభ్యుల్లో తీర్మానానికి అనుకూలంగా 232 మంది ఓటేయగా 196 మంది వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికే ట్రంప్‌పై అభిశంసన చేపట్టామని అని స్పీకర్‌ నాన్సీ పెలోసి అంటుండగా, ఈ చర్యను రిపబ్లికన్లు తప్పుపడుతున్నారు. కాగా ట్రంప్‌ పార్టీ రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న సెనేట్‌లో ఈ తీర్మానం వీగిపోతుందన్న ధీమాతో వుంది.
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసనకు ప్రతిపక్ష డెమోక్రాట్లు అమెరికా ప్రతినిధుల సభలో పావులు కదిపారు. ట్రంప్‌ తన రాజకీయ ప్రత్యర్థి, డెమోక్రాట్‌ నేత జో బిడెన్‌పై అవినీతి ఆరోపణలు మోపి, ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో స్పీకర్‌ నాన్సీ పెలోసి ఆయనపై  తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యుల్లో తీర్మానానికి అనుకూలంగా 232 మంది ఓటేశారు. 196 మంది వ్యతిరేకించారు.
అమెరికా రాజ్యాంగ పరిరక్షణ కోసమే అధ్యక్షునిపై అభిశంసన నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు స్పీకర్‌ నాన్సీ పెలోసి. ఈ తీర్మానానికి రిపబ్లికన్లు ఎందుకు భయపడుతున్నారో చెప్సాల్సిన అవసరం ఉందన్నారామె. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే ఈ తీర్మానం అంటున్నారు పెలోసి.
అధ్యక్షుడు ట్రంప్‌పై నాన్సి పోలోసితో పాటు డెమోక్రట్లు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానాన్ని తప్పు పట్టారు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు. సోవియట్‌ యూనియన్‌ తరహా రూల్స్‌ చెల్లవని స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రిపబ్లికన్‌ సభ్యుడు స్టీవ్‌ స్కాలిన్‌.
కాగా కొందరు రిపబ్లికన్లు కూడా ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు ఇస్తున్నారు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని గుర్తుంచుకోవాలని ఆ పార్టీకి చెందిన జిమ్‌ మెక్‌గోవర్న్‌ అంటున్నారు. డెమెక్రాట్లు అధ్యక్షుని బ్యాలెట్‌ పద్దతిలో ఓడించలేక ఇలాంటి తీర్మానాల ద్వారా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు సభలోని మైనారిటీ సభ్యుడు కెవిన్‌.
అమెరికా ప్రతినిధుల సభలో అధికార రిపబ్లికన్లకన్నా ప్రతిపక్ష డెమోక్రట్‌లదే పై చేయికావడంతో తీర్మానం తేలికగా నెగ్గింది. అయితే సెనేట్​లో అధికార రిపబ్లికన్ పార్టీ 53 సీట్లతో మెజారిటీ కలిగి ఉంది. డెమోక్రాట్లకు 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనుక సెనేట్​లో అభిశంసన తీర్మానం నెగ్గే అవకాశం లేదు. అమెరికా చరిత్రను గమనించినట్లయితే  దేశాధ్యక్షుడిపై ఇలా అభిశంసన తీర్మానం నెగ్గడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు ఆండ్రూ జాన్సన్​, బిల్​ క్లింటన్​ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే సెనేట్​లో మాత్రం వారి అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఇప్పటి వరకు అభిశంసన ప్రక్రియ ద్వారా ఏ అమెరికా అధ్యక్షుడినీ తొలగించలేదు.

Related Tags