మంత్రి కేటీఆర్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్‌ భేటీ

American consul general Joel Reifman meets minister Ktr, మంత్రి కేటీఆర్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్‌ భేటీ

తెలంగాణ మున్సిపల్,ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో  అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. రెండోసారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌‌కు జోయల్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తులో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. వివిధ రంగాల్లో అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందాలను కేటీఆర్ జోయల్‌కు వివరించారు.దేశంలో మెట్రో నగరాలకు ధీటుగా నగరం వృద్ధి చెందుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ భేటీలో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్‌తో పాటు కాన్సులర్ చీఫ్ ఎరిక్ అలగ్జాండర్, ఎకనామిక్ స్పెషలిస్ట్ క్రిస్టోన్ లోయిర్‌లు కూడా పాల్గొన్నారు. ఇక మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *