అమెరికాలో వీచాట్ కూ గ్రీన్ సిగ్నల్

అమెరికాలో వీఛాట్ కూ గ్రీన్ సిగ్నల్ లభించింది. యాప్ స్టోర్స్ నుంచి ఈ యాప్ ను తొలగించాలన్న వాణిజ్యశాఖ ఉత్తర్వులను శాన్ ఫ్రాన్సిస్కో లోని మేజిస్ట్రేట్ కోర్టు రద్దు చేసింది. ఈ ఆర్డర్ ను సవాలు చేస్తూ వీఛాట్ యూజర్లు లా సూట్ (దావా) వేశారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:05 am, Mon, 21 September 20
అమెరికాలో వీచాట్ కూ గ్రీన్ సిగ్నల్

అమెరికాలో వీఛాట్ కూ గ్రీన్ సిగ్నల్ లభించింది. యాప్ స్టోర్స్ నుంచి ఈ యాప్ ను తొలగించాలన్న వాణిజ్యశాఖ ఉత్తర్వులను శాన్ ఫ్రాన్సిస్కో లోని మేజిస్ట్రేట్ కోర్టు రద్దు చేసింది. ఈ ఆర్డర్ ను సవాలు చేస్తూ వీఛాట్ యూజర్లు లా సూట్ (దావా) వేశారు. ఇందులోని మెరిట్ ని పరిగణనలోకి తీసుకున్నామని, వారి వాదన సహేతుకమేనని కోర్టు పేర్కొంది. టెంసెంట్ హోల్డింగ్ ఆధ్వర్యంలోని వీచాట్ దేశ భద్రతకు ముప్పుగా ఉందని (టిక్ టాక్ మాదిరే) పేర్కొంటూ యాప్ స్టోర్స్ నుంచి దీన్ని తొలగించాలని వాణిజ్య శాఖ సూచించింది. అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్లపై అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతానికి సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఛాట్ కి కూడా ‘మోక్షం’ లభించింది.