విద్యార్థి ప్రాణం తీసిన జలపాతం

అమెరికాలో జలపాతాలను చూసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థి విగతజీవిగా మారాడు. ఓక్లహామాలోని ఎత్తైన జలపాతమైన టర్నర్ జలపాతంలో మునిగి తెలుగు విద్యార్థి నాగ సుభాష్‌ మోతురు మృతిచెందాడని సిటీ ఆఫ్‌ డేవిస్‌ పోలీసులు తెలిపారు.

విద్యార్థి ప్రాణం తీసిన జలపాతం
Follow us

|

Updated on: May 14, 2020 | 3:43 PM

అమెరికాలో జలపాతాలను చూసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థి విగతజీవిగా మారాడు. ఓక్లహామాలోని ఎత్తైన జలపాతమైన టర్నర్ జలపాతంలో మునిగి తెలుగు విద్యార్థి నాగ సుభాష్‌ మోతురు మృతిచెందాడని సిటీ ఆఫ్‌ డేవిస్‌ పోలీసులు తెలిపారు. టెక్సాస్‌లోని విచిత ఫాల్స్‌కు చెందిన నాగ సుభాష్‌ మోతురు ప్రమాదావశాత్తు బ్లూ హోల్‌ పూల్‌లో పడి మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. సుభాష్‌ టెక్సాస్‌లోని విచిత ఫాల్స్‌లోని మిడ్‌ వెస్ట్రన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి టర్నర్‌ ఫాల్స్‌జలపాతం సందర్శించడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో జలపాతం వద్ద లైఫ్‌గార్డులు ఎవరూ విధుల్లో లేకపోవడంతో రక్షించేవారు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాగ సుభాష్ మృతదేహాన్నిఇండియాకు తీసుకెళ్లడానికి సహాయం చేయాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.