Joe Biden Calls on Nation : నేను మీ వాడిని.. తొలి ప్రసంగంలోనే ఆకట్టుకున్న నూతన అధ్యక్షుడు జో బైడెన్

అమెరికాలో జో బైడెన్ శకం మొదలైంది. ఆ దేశానికి 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో..

Joe Biden Calls on Nation : నేను మీ వాడిని.. తొలి ప్రసంగంలోనే ఆకట్టుకున్న నూతన అధ్యక్షుడు జో బైడెన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 21, 2021 | 6:15 AM

Joe Biden Calls on Nation : అమెరికాలో జో బైడెన్ శకం మొదలైంది. ఆ దేశానికి 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో అందరిని ఆకట్టుకున్నారు. అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోవిడ్ సంక్షోభ సమయంలో తాను ప్రమాణస్వీకారం చేయడం చరిత్రాత్మక ఘటం అంటూ అభివర్ణించారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణం చేయడం అమెరికాకే గర్వకారణమని పేర్కొన్నారు.

అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని చెప్పుకొచ్చారు. ముందు ముందు సాధించాల్సింది చాలా ఉందని బైడెన్ అన్నారు. క్యాపిటల్ హిల్ హింసతో అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారని… ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందని పరోక్షంగా ట్రంప్‌ పాలనను దుయ్యబట్టారు. అదే సమయంలో తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానంటూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

దేశాభివృద్ధికి ప్రతి ఒక్క అమెరికన్‌ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తామని, శ్వేత వర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తామని ఉద్ఘాటించారు. కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయని, ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కషష్టకాలంలో మన శక్తియుక్తులన్నీ ప్రోది చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్‌ అన్నారు. అందుకు ఐకమత్యంతో కలిసి ముందుకెళ్లాల్సి ఉందని చెప్పారు.

హింస, ఉగ్రవాదం, నిరుద్యోగం వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కరోనా వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, 4 లక్షల మందిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మనం ఒడిపోలేదని, ఇప్పుడు అమెరికా చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైందని బైడెన్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : 

క్రికెట్ ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్…స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించే యోచనలో బీసీసీఐ

Kamala Harris Sworn : అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ కొత్త చరిత్ర

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!