చమురు అక్రమ రవాణా.. మరో ఓడను స్వాధీనం చేసుకున్న ఇరాన్

అక్రమంగా ఆయిల్ రవాణా చేస్తుందన్న ఆరోపణలతో గల్ఫ్‌లో మరో ఓడను స్వాధీనం చేసుకుంది ఇరాన్. ఫార్సీ ఐలాండ్ సమీపంలో ఈ ట్యాంకర్‌ను ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ సీజ్ చేసినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఆ ఓడలో 7లక్షల లీటర్ల అక్రమ చమురు ఉందని.. అందులో ఉన్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెల రోజుల వ్యవధిలో ఇరాన్.. విదేశీ ట్యాంకర్లను పట్టుకోవడం ఇది మూడోసారి, దీంతో టెహ్రాన్, అమెరికా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:00 pm, Tue, 6 August 19
చమురు అక్రమ రవాణా.. మరో ఓడను స్వాధీనం చేసుకున్న ఇరాన్

అక్రమంగా ఆయిల్ రవాణా చేస్తుందన్న ఆరోపణలతో గల్ఫ్‌లో మరో ఓడను స్వాధీనం చేసుకుంది ఇరాన్. ఫార్సీ ఐలాండ్ సమీపంలో ఈ ట్యాంకర్‌ను ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ సీజ్ చేసినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఆ ఓడలో 7లక్షల లీటర్ల అక్రమ చమురు ఉందని.. అందులో ఉన్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెల రోజుల వ్యవధిలో ఇరాన్.. విదేశీ ట్యాంకర్లను పట్టుకోవడం ఇది మూడోసారి, దీంతో టెహ్రాన్, అమెరికా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.